లేటెస్ట్ న్యూస్…

హైదరాబాద్ లో రెండవ రోజు కొనసాగుతున్న ఈడీ సోదాలు*

హైదరాబాద్‌ నగరంలో రెండవ రోజూ ఎన్‌ఫోర్స్‌ మెంట్‌ డైరెక్టరేట్‌ సోదాలు..

హైదరాబాద్‌ నగరంలో రెండవ రోజూ ఎన్‌ఫోర్స్‌ మెంట్‌ డైరెక్టరేట్‌ సోదాలు కొనసాగుతున్నాయి. దేశంలో ఆర్థిక నేరాలను అరికట్టే ఉద్దేశంతో ఈడీ చేపట్టిన ఈ దాడుల్లో పలు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.

ముఖ్యంగా సురానా ఇండస్ట్రీస్‌ ఎండీ నరేంద్ర సురానా నివాసంలో పెద్ద ఎత్తున నగదు స్వాధీనం కావడం కలకలం రేపుతోంది. ఈడీ ప్రాథమిక విచారణలో నరేంద్ర సురా నా పలు షెల్ కంపెనీలు ఏర్పాటు చేసి, బ్యాంకుల నుంచి పొందిన రుణాలను వీటి ద్వారా అక్రమ లావా దేవీలకు ఉపయోగించినట్లు గుర్తించారు.

ఈ షెల్ కంపెనీలకు నిధులు బదలాయింపుతో పాటు, భారీ మొత్తంలో రియల్ ఎస్టేట్ సంస్థల్లో పెట్టుబడు లు పెట్టినట్టు అధికారులు గుర్తించారు. ఈ వ్యవహారం పై ఈడీ మరింత లోతుగా విచారణ జరుపుతోంది.

ఈ సోదాల్లో మరో కీలక సంఘటన సాయి సూర్య డెవలపర్స్‌కు చెందిన సతీ ష్ ఇంట్లో భారీగా నగదు స్వాధీనం కావడం. అలాగే సాయి సూర్య సంస్థల కార్యాలయాల్లోనూ కోట్లల్లో నగదు పట్టుబడింది.

గతంలోనే సైబరాబాద్ పోలీసులు సతీష్‌ను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. వట్టి నాగులపల్లి ప్రాంతంలో “వెంచర్” పేరుతో ప్రజల నుంచి డబ్బులు వసూలు చేసి మోసం చేసినట్లు పోలీసులు కేసు నమోదు చేశారు.

ఈ కేసును దృష్టిలో ఉంచు కుని ఈడీ అధికారులు సాయి సూర్య డెవలపర్స్‌పై విచారణ చేపట్టారు. ఇప్పటికే సంస్థకు చెందిన పలు బ్యాంకు లావాదేవీలు, ప్రాపర్టీల వివరాలను సేకరిస్తున్నారు. మొత్తం మీద ఈడీ దాడులతో నగర వ్యాప్తంగా ఆర్థిక నేరాలపై ఉక్కుపాదం వేసే దిశగా చర్యలు సాగుతున్నట్లు అధికారులు భావిస్తున్నారు.

ఈడీ సోదాల్లో నగదు, షెల్ కంపెనీల వ్యవహారాలు వెలుగులోకి రావడం ఇప్పటికే ఉన్న పోలీసు కేసులతో ముడిపడడం వల్ల ఈ దర్యాప్తు మరింత ఉత్కంఠకు గురిచేస్తోంది. ముందు ముందు రోజుల్లో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశముంది.

బీజేపీ ఈడి, సీబీఐ ల మీద ఆధారపడి ప్రభుత్వాన్ని నడుపుతుంది – మంత్రి పొన్నం ప్రభాకర్

దేశం కోసం ప్రాణాలు అర్పించి దేశంలో ప్రజాస్వామికంగా పరిపాలన కొనసాగించి ప్రాణాలు అర్పించిన కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అవినీతికి పాల్పడదల్చుకుంటే వారి చేతిలో ఉన్నటువంటి అధికారం ఎప్పుడో ఉపయోగపడేది

కానీ దేశ అభివృద్ధి కోసమే త్యాగం చేసిన కుటుంబం గాంధీ కుటుంబం

నరేంద్ర మోడీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలతో రాజకీయంగా ఎదుర్కోలేక కాంగ్రెస్ పార్టీ బలపడుతుందో .. బీజేపీ బలహీన పడే సందర్భంలో పార్లమెంట్ లో బయట నరేంద్ర మోడీ జవాబు చెప్పలేక వ్యతిరేకత వస్తున్న సందర్భంలో కాంగ్రెస్ నాయకత్వాన్ని వేధింపులతో గురి చేస్తుంది

ఇది రాజకీయ కక్ష సాధింపు చర్య

80 సంవత్సరాలు ఉన్న సోనియా గాంధీ గారి పై ఇలాంటి వేధింపులు సరైంది కాదు

నేషనల్ హెరాల్డ్ పత్రిక ఆరోజు స్వాతంత్రం కోసం పోరాడింది

బీజేపీ ఈడి , సీబీఐ ల మీద ఆధారపడి ప్రభుత్వాన్ని నడుపుతుంది

మిత్రపక్షాలు ఎంత అవినీతి చేసిన మాట్లాడకుండా ప్రత్యర్థులను కక్ష సాధింపు ధోరణి మంచిది కాదు

రాజకీయంగా ఎలాంటి మచ్చలేని కుటుంబాన్ని దేశ స్వాతంత్రం కోసం పోరాడిన కుటుంబాన్ని ఇలా వేధించడం సరికాదు వారికి దేశం మొత్తం అండగా ఉంటుంది

కాంగ్రెస్ పార్టీ దేశ వ్యాప్తంగా నిరసనలు తెలుపుతుంది

దేశం మొత్తం ఆదని అంబానీ లకు అమ్మేసేవారు చేస్తున్న కుట్రలను ఖండిస్తూ గాంధీ కుటుంబానికి తెలంగాణ కాంగ్రెస్ అండగా ఉంటుంది..

త్వరలో సూది లేని ఇంజెక్షన్!

త్వరలోనే సూదిలేని ఇంజెక్షన్ ను అందుబాటులోకి తీసుకొస్తామని ‘ఇంటెగ్రి మెడికల్’ సంస్థ ప్రకటించింది. “ఎన్-ఫిస్’ పేరిట సూది రహిత ఇంజెక్షన్లను అందుబాటులోకి తీసుకొచ్చాం. ఈ పరికరం మందును అధిక వేగంతో చర్మం పై ఉండే రంధ్రాల్లోకి జొప్పిస్తుంది. దాంతో ఎలాంటి నొప్పి లేకుండా కండరాల్లోకి ఔషధం వెళ్తుంది. దీనిని దేశంలో వెయ్యి మంది వైద్యులు ప్రయోగాత్మకంగా వినియోగిస్తున్నారు” అని ఇంటెగ్రి మెడికల్ సంస్థ
తెలిపింది..

అకాల వర్షానికి పంట నష్టం.. గుండెలవిసేలా రోదించి సొమ్మసిల్లి పడిపోయిన మహిళా రైతు

రైతులకు కన్నీళ్లే మిగిల్చిన కాంగ్రెస్ ప్రభుత్వం

కొనుగోళ్లు చేయకపోవడంతో ఆలస్యమై అకాల వర్షానికి పంట నష్టం

వరంగల్ జిల్లా నర్సంపేట మండలం ముత్యాలమ్మ తండాలో వారికున్న 2.30 ఎకరాల్లో రూ.60 వేల పెట్టు బడితో మొక్కజొన్న సాగు చేసిన గిరిజన మహిళా రైతు బానోతు మంగమ్మ

ఇటీవలే పంటను కోసి నాలుగు ట్రాక్టర్లలో మక్కలను మూడురోజుల కిందట నర్సంపేట మార్కెట్ యార్డుకు తీసుకొచ్చి ఆరబోయగా.. విక్రయిద్దామని అనుకుంటుండగా.. భారీ వర్షానికి పంటను కుప్పచేసే లోపే వరదలో కొట్టుకుపోయిన ముప్పావువంతు పంట

ఇది చూసి మంగమ్మ ఏడ్చి ఏడ్చి మార్కెట్ లోనే సొమ్మసిల్లడంతో ఆసుపత్రికి తరలించిన కుటుంబ సభ్యులు, అధికారులు..

Gold and Silver Prices Today:
పరుగులు తీస్తున్న పుత్తడి.. లక్ష చేరువులో తులం బంగారం..

నేడు ప్రధాన నగరాల్లో బంగారం ధరలు..

పసిడి ప్రియులకు షాక్ ఇస్తూ బంగారం ధరలు పరుగులు పెడుతున్నాయి. ఆల్ టైం హైకి చేరుకున్నాయి. తొలిసారిగా తులం బంగారం లక్ష చెరువులో ఉంది.

– హైదరాబాద్ లో పసిడి ధర ఈరోజు స్వల్పంగా పెరిగింది. అదే సమయంలో బంగారం ఆల్ టైం హై కి చేరుకుంది. ఈ రోజు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 88,160 చేరుకుంది. ప్యూర్ గోల్డ్ అంటే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.96,180లకు చేరుకుంది.

– దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల బంగారం ధర 22 క్యారెట్ల ధర రూ. 88,310లకు చేరుకోగా.. ప్యూర్ గోల్డ్ 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 96330లకు చేరుకుంది.

– దేశ ఆర్ధిక రాజధాని ముంబైలో 10 గ్రాముల బంగారం ధర 22 క్యారెట్ల ధర రూ. 88160లకు చేరుకుంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం 96,180 వద్ద కొనసాగుతోంది.

– చెన్నైలో 10 గ్రాముల బంగారం ధర 22 క్యారెట్ల ధర రూ.88160లకు చేరుకోగా.. ప్యూర్ గోల్డ్ పది గ్రాములు 96,180లకు చేరుకుంది. ఇవే ధరలు దేశంలో ప్రధాన నగరాలైన కేరళ, కోల్ కత, బెంగుళూరుల్లో కూడా కొనసాగుతున్నాయి.

ఈ రోజు వెండి ధర ..

– ఈ రోజు వెండి బంగారం బాటలో నడుస్తూ స్వల్పంగా పెరుగుదల నమోదు చేసుకుంది. నిన్నటి తో పోలిస్తే కిలోకి వంద రూపాయల మేర పెరిగి రూ. 1,10,100లకు చేరుకుంది. ఇవే ధరలు హైదరాబాద్ సహా తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతుండగా.. ధిల్లీ వంటి రాష్ట్రాల్లో వెండి కొంత మేర తగ్గుతుంది..

హైదరాబాద్ మెట్రో చార్జీల పెంపు

రూ.6500 కోట్ల భారీ నష్టాల్లో ఉన్నట్లు తెలిపిన L&T మెట్రో సంస్థ

కోవిడ్ సమయంలో తీవ్రంగా నష్టపోయామని, మెట్రో చార్జీలు పెంచాలని అప్పటి ప్రభుత్వాన్ని కోరిన L&T సంస్థ

కానీ అప్పటి ప్రభుత్వం చార్జీల పెంపుకు సుముఖత చూపకపోవడంతో వాయిదా

కానీ ఇప్పుడు చార్జీల పెంపు తధ్యమని అంటున్న L&T సంస్థ

ఇటీవల బెంగళూరులో 44% మెట్రో చార్జీలు పెరగడంతో, హైదరాబాద్ లో ఎంత పెంచాలనే యోచనలో L&T మెట్రో సంస్థ

ఇప్పటికే రూ.59 హాలిడే సేవర్ కార్డు రద్దు, మెట్రోకార్డుపై రద్దీ వేళల్లో 10% డిస్కౌంట్ ఎత్తివేసిన సంస్థ..