భారతీయ జీవిత బీమా సంస్థ మహిళల ఆర్థిక సాధికారతను లక్ష్యంగా చేసుకుని సరికొత్త పథకాన్ని తీసుకువచ్చింది. బీమా సఖి యోజన పేరుతో ప్రారంభించిన ఈ పథకం ద్వారా మహిళలు ఇంటి వద్దనే ఉంటూ స్థిరమైన నెలవారీ ఆదాయాన్ని సంపాదించుకోవచ్చు. డిసెంబర్ 2024లో నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రారంభించిన ఈ పథకం.. మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడంతో పాటు మారుమూల ప్రాంతాలకు కూడా బీమా సేవలను విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకుంది..
ఈ పథకంలో ఏడాదిలో లక్ష మందిని నియమించనున్నట్లు ఎల్ఐసీ ఎండీ సిద్ధార్థ్ మహంతి చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ పథకాన్ని సోమవారం ప్రారంభించారు. ఈ పథకం పూర్తి పేరు బీమ సఖి యోజన. మహిళా సాధికారతకు ఎల్ఐసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు.
ఐఆర్డీఏఐ ఈ మహిళలకు ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. ఎల్ఐసీ మొదటి ఏడాది బీమ సఖి యోజన ద్వారా రూ.840 కోట్లు కేటాయిస్తుందని సిద్ధార్థ మొహంతీ చెప్పారు. ఇక ఏడాదిలో కనీసం 24 పాలసీలు విక్రయించిన మహిళలకు స్టైఫండ్ కాకుండా అదనంగా కమీషన్ కూడా అందించనున్నట్లు చెప్పారు..
ఏమిటీ బీమా సఖి పథకం?.
ఈ పథకంలో ఎంపికైన మహిళలకు LIC ప్రత్యేక శిక్షణ ఇస్తుంది. వారు బీమా ఏజెంట్లుగా వ్యవహరిస్తూ, ప్రజలకు పాలసీల గురించి అవగాహన కల్పిస్తారు. ఈ ప్రక్రియలో వారికి స్టైఫండ్‌తో పాటు కమీషన్ కూడా లభిస్తుంది..
మొదటి సంవత్సరం: నెలకు రూ.7,000 స్టైఫండ్.
రెండవ సంవత్సరం: నెలకు రూ.6,000 స్టైఫండ్.
(మొదటి సంవత్సరంలో కనీసం 65 శాతం పాలసీలను పూర్తి చేస్తేనే ఇది వర్తిస్తుంది).
మూడవ సంవత్సరం: నెలకు రూ.5,000 స్టైఫండ్.
కమీషన్: స్టైఫండ్‌తో పాటు మొదటి సంవత్సరంలో రూ. 48,000 వరకు కమీషన్ (బోనస్ మినహా) పొందే అవకాశం ఉంది.
దరఖాస్తు విధానం:..
LIC అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.
హోమ్ పేజీలో “క్లిక్ ఫర్ బీమా సఖి” ఎంపికపై క్లిక్ చేయండి.
దరఖాస్తు ఫామ్‌లో మీ వివరాలను సరిగ్గా నమోదు చేయండి.
అవసరమైన పత్రాలను అప్లోడ్ చేసి, ఫామ్‌ను సమర్పించండి..
సమీపంలోని LIC బ్రాంచ్ ఆఫీసులో కూడా దరఖాస్తు చేసుకోవచ్చు..
ఎవరు దరఖాస్తు చేసుకోవడానికి అనర్హులు?
ప్రస్తుతం LIC ఏజెంట్లుగా లేదా ఉద్యోగులుగా పనిచేస్తున్నవారు, వారి బంధువులు
రిటైర్డ్ LIC ఉద్యోగులు, మాజీ ఏజెంట్లు.
అర్హతలు.
కేవలం మహిళలు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.
18 నుండి 70 సంవత్సరాల మధ్య ఉండాలి.
కనీసం 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.
ఆర్థిక ప్రయోజనాలు:
ఈ పథకం కింద ఎంపికైన మహిళలకు 3 సంవత్సరాల పాటు స్టైఫండ్ అందుతుంది..