పొట్టి ప్రపంచకప్లో సెమీఫైనల్ రేసు ఆసక్తికరంగా మారింది. రెండేసీ విజయాలతో గ్రూప్ ‘ఏ’ నుంచి దక్షిణాఫ్రికా (South Africa).. గ్రూప్ ‘బీ’ నుంచి ఇంగ్లండ్ (England) ముందంజ వేశాయి. చివరి రెండు బెర్తులపై మాత్రం ఉత్కంఠ కొనసాగుతోంది. జింబాబ్వేపై విజయంతో భారత జట్టు పోటీలోకి రాగా.. పాకిస్థాన్ ఆశలన్నీ ఇంగ్లండ్, న్యూజిలాండ్ మ్యాచ్ మీదే ఉన్నాయి. అయితే.. టీ20 వరల్డ్కప్ చరిత్రలో కివీస్పై ఇంగ్లీష్ జట్టుదే పైచేయి. ఇరుజట్లు 7సార్లు తలపడగా.. బ్లాక్ క్యాప్స్ మూడింటా గెలిచిందంతే. ఈ నేపథ్యంలో సపర్ 8లో ఆఖరి పంచ్ విసిరేది ఎవరు? అనేది ఆసక్తికరంగా మారింది..లీగ్ దశ తర్వాత పుంజుకున్న ఇంగ్లండ్ వరుస విజయాలతో సెమీస్కు దూసుకెళ్లింది. సూపర్ 8 తొలి పోరులో శ్రీలంకకు చెక్ పెట్టిన హ్యారీ బ్రూక్ సేన .. పాకిస్థాన్నూ ఓడించింది. ఆరంభంలోనే వికెట్లు పడినా.. హ్యారీ బ్రూక్ చిరస్మరణీయ సెంచరీతో జట్టును గెలిపించాడు. గ్రూప్ బీ నుంచి మరే జట్టుకు నాలుగు.. అంతకంటే ఎక్కువ పాయింట్లు వచ్చే అవకాశం లేనదందున ఇంగ్లండ్ దర్జాగా ఐదోసారి సెమీస్ గడప తొక్కింది…ఈ పరిస్థితుల్లో.. చివరి బెర్తుకోసం పాక్, కివీస్ మధ్య పోటీ నెలకొంది. ఇరుజట్ల మధ్య తొలిమ్యాచ్ వర్షార్పణం కావడం పెద్ద మైనస్ అయిందనే చెప్పాలి. అయితే.. గత మ్యాచ్లో ఆతిథ్య శ్రీలంకకు ఊహించని షాకిచ్చిన మిచెల్ శాంట్నర్ సేన.. 3 పాయింట్లతో పాక్ (2 పాయింట్లు) కంటే ముందంజలో ఉంది. శుక్రవారం ఇంగ్లండ్ను ఆ జట్టు ఓడించిందంటే.. 5 పాయింట్లతో సెమీస్ చేరడం ఖాయం. అప్పుడు.. సల్మాన్ అఘా సారథ్యంలోని పాక్ టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది..
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.