లైక్స్ కోసం మనిషిని బురదలో పూడ్చారు!..పిచ్చిపట్టినట్లు ఉంది నెట్ జనుల ఆగ్రహం..!

*Today news information*
*లైక్స్ కోసం మనిషిని బురదలో పూడ్చారు!.

సోషల్ మీడియా(Social Media)లో వైరల్ అయ్యేందుకు కొందరు యువకులు వెర్రీ చేష్టలకు పాల్పడుతున్నారు. ఫాలోయింగ్ పెంచుకునేందుకు క్రేజీ తింగ్స్(Creazy Things) పేరుతో పిచ్చిపనులు చేసి ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. ఇలాంటి ఘటనకు సంబంధించిన వీడియోనే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది…

సోషల్ మీడియాలో వైరలయ్యేందుకు కొందరు పిచ్చిపట్టినట్లు ప్రవర్తిస్తున్నారు. ప్రమాదకరంగా వీడియోలు తీస్తూ ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా ముగ్గురు యువకులు బురదలో ఉండి తీసిన వీడియో వైరలవుతోంది అందులో జాతీయ జెండాతో ఓ యువకుడు మరొకరిని బురదలో పూడ్చి లైక్ చేయాలంటూ వేడుకున్నాడు. ఈ ముగ్గురే మరొక వీడియోలో మట్టిలో ఒకరిని పూడ్చుతూ లైక్స్ కోసం రిక్వెస్ట్ చేశారు.