మద్యం షాపుల డ్రాకు సర్వం సిద్ధం…..!

మద్యం షాపుల డ్రాకు సర్వం సిద్ధం
తెలంగాణలో 2620 మద్యం షాపుల కేటాయింపునకు సంబంధించిన డ్రా ప్రక్రియ సోమవారం ఉదయం 11 గంటలకు జరగనుంది. హైకోర్టు నుంచి అనుమతి లభించడంతో, ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేయాలని ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ కమిషనర్‌ సి.హరికిరణ్‌ అధికారులను ఆదేశించారు. ఈ ప్రక్రియను కలెక్టర్లు పర్యవేక్షించనున్నారు. మొత్తం 95,137 దరఖాస్తులు ఈ షాపుల కోసం వచ్చాయి..