లోక్ సభలో వీగిపోయిన మహిళా రిజర్వేషన్ బిల్లు!

లోక్‌సభలో వీగిపోయిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లు.

మహిళా రిజర్వేషన్ చట్టం సవరణ బిల్లుకు బ్రేక్‌..

రాజ్యాంగ సవరణ బిల్లుకు మొత్తం పోలైన ఓట్లు 528. అనుకూలంగా 298 ఓట్లు, వ్యతిరేకంగా 230 ఓట్లు..

దీంతో డీలిమిటేషన్ మరియు కేంద్ర పాలిత ప్రాంతాల సవరణ బిల్లును కూడా ఉపసంహరించుకున్న కేంద్ర ప్రభుత్వం..

దేశ రాజకీయాల్లో పెను సంచలనం నమోదైంది. ఎన్నో ఆశల మధ్య లోక్‌సభ ముందుకు వచ్చిన మహిళా రిజర్వేషన్ బిల్లు (రాజ్యాంగ సవరణ బిల్లు) ఓటింగ్ దశలో చతికిలపడింది. ఈ బిల్లు చట్టంగా మారాలంటే సభలో మూడింట రెండొంతుల (2/3rd) మెజారిటీ సభ్యుల మద్దతు అవసరం. కానీ, జరిగిన ఓటింగ్‌లో బిల్లుకు అనుకూలంగా 298 ఓట్లు రాగా, వ్యతిరేకంగా 230 ఓట్లు పడ్డాయి. దీనితో బిల్లు ఆమోదానికి కావాల్సిన మద్దతు లభించకపోవడంతో ఇది వీగిపోయినట్లు స్పీకర్ ప్రకటించారు. ఓటింగ్‌ ప్రక్రియలో మొత్తం 528 మంది సభ్యులు పాల్గొన్నారు. మెజారిటీ అవసరమైన 326 ఓట్లను ఎన్డీఏ సాధించలేకపోయింది. దీంతో మిగతా రెండు బిల్లులను వెనక్కి తీసుకుంటున్నట్లు కేంద్ర మంత్రి కిరణ్‌ రిజిజు ప్రకటించారు..

కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో ప్రవేశపెట్టిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోయింది. ఓటింగ్‌లో 528 మంది ఎంపీలు పాల్గొనగా కేంద్రానికి అనుకూలంగా 298 ఓట్లు వచ్చాయి. వ్యతిరేకంగా 230 మంది ఓటేశారు. రాజ్యంగ సవరణ బిల్లుకు ఓట్లు రాకపోవడంతో డీలిమిటేషన్, కేంద్రపాలిత ప్రాంతాల చట్ట సవరణ బిల్లులను కూడా వెనక్కి తీసుకున్నట్లు స్పీకర్ ఓం బిర్లా తెలిపారు. దీంతో ఈ మూడు బిల్లులకు ఆమోదం లభించకుండా పోయింది. ఫలితంగా మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్‌ అమలుకు బ్రేక్‌ పడింది. దేశవ్యాప్తంగా లోక్‌సభ, అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇక సీట్ల పెంపు ఉండదు. ..