లాస్ ఏంజెల్స్ లో జరుగుతున్న అల్లర్లలో హింసాత్మక సంఘటనలు ..!

అమెరికా ప్రభుత్వం చేస్తున్న వలస దారుల అరెస్టులకు వ్యతిరేకంగా ఇవి కొనసాగుతున్నాయి.
ఆదివారం నాడు లాస్ ఏంజిల్స్ డౌన్‌టౌన్‌లో నిరసనకారులు అనేక వేమో సెల్ఫ్ డ్రైవింగ్ టాక్సీలను తగలబెట్టి ధ్వంసం చేశారు . కొనసాగుతున్న అశాంతికి ప్రతిస్పందనగా సుమారు 500 మంది యాక్టివ్-డ్యూటీ మెరైన్లు “మోహరించడానికి సిద్ధంగా” ఉన్నారని US నార్తర్న్ కమాండ్ ప్రకటించడంతో ఈ సంఘటన జరిగింది. కాలిఫోర్నియాలోని ట్వెంటీనైన్ పామ్స్‌లోని మెరైన్ కార్ప్స్ ఎయిర్ గ్రౌండ్ కంబాట్ సెంటర్ నుండి దళాలను మోహరించనున్నారు..

వేలాది మంది ప్రజలు ఈ ఆందోళనల్లో పాల్గొంటూ, భద్రతా బలగాలతో తలపడుతున్నాయి..అమెరికాలో వలస అధికారులను అరెస్టులు చేయడం ఈ ఆందోళనలకు ప్రధాన కారణం.. రోజుకు దాదాపు 2,000 మందిని అరెస్టు చేస్తున్నారు. అయితే రోజుకు 3,000 మందిని అరెస్టు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. అయితే ఈ అరెస్టులకు వ్యతిరేకంగా చాలా మంది ప్రజలు, ముఖ్యంగా మెక్సికన్ జెండాలు పట్టుకుని రోడ్డెక్కుతున్నారు. ఇలా నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఆందోళన చేస్తున్నారు. ఈ హింసాత్మక సంఘటనల్లో ఆందోళనకారులు పోలీసులపై రాళ్లు, సీసాలు విసిరారు. కొందరు ఆందోళనకారులు నగరంలోని ఓ ప్రధాన రహదారిని మూసేసి, నడిచే కార్లకు నిప్పు పెట్టారు. ఆందోళనలను నియంత్రించేందుకు టియర్‌ గ్యాస్‌ వినియోగించారు.

లాస్ ఏంజెల్స్ లో జరుగుతున్న అల్లర్లపై అధ్యక్షుడు ట్రంప్‌ స్పందించారు. లాస్‌ ఏంజెల్స్‌ లో ఒక గొప్ప నగరమని, కానీ ఇప్పుడు అక్రమ వలసదారులు, నేరస్థులు దాన్ని ఆక్రమించారని ట్రంప్ అభిప్రాయపడ్డారు. వలసదారులను డిపోర్టే చేయడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ సంస్థలను ఆదేశించారు.

ఇదే సమయంలో లాస్ ఏంజెల్స్ మేయర్ కరెన్ బాస్ ప్రజలను శాంతియుతంగా ఉండాలని కోరారు. మన నగరం చాలా కష్టాలను ఎదుర్కుందని, ఇప్పుడు మనం శాంతిని కాపాడాలని ఆమె సిటీ హాల్‌లో జరిగిన సమావేశంలో వెల్లడించారు. ట్రంప్ జాతీయ గార్డ్‌ను మోహరించడం తప్పని, దాన్ని వెనక్కి పిలవాలని ఆమె గవర్నర్ న్యూసమ్‌తో ఏకీభవించారు. శాంతియుతంగా ఆందోళన చేయాలని, హింసకు పాల్పడవద్దని కోరారు. ఈ ఆందోళనలు మూడో రోజు కొనసాగుతున్నాయి. ప్రజలు, పోలీసుల మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి.

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ అన్నంత పనిచేశారు. 12 దేశాలకు అమెరికాలోకి నో ఎంట్రీ ఇవాళ్టి నుంచి అమలులోకి రానున్నాయి. నేటి నుంచి నిషేధ ఉత్తర్వులు అమలులోకి వచ్చాయి. అఫ్ఘానిస్థాన్‌, ఇరాన్‌, హైతీ, లిబియా, యెమెన్‌, సూడాన్‌, సొమాలియా, చాద్‌, మయన్మార్‌, ఎరిత్రియా, రిపబ్లిక్‌ ఆఫ్‌ కాంగో, ఈక్వటోరియల్‌ గినియా దేశాల ప్రజలకు ఇకపై యూఎస్‌ ద్వారాలు మూసుకుపోయాయి. విదేశీ ఉగ్రవాదుల నుంచి అమెరికాను రక్షించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వైట్‌ హౌస్‌ వర్గాలు తెలిపారు.