కాంగ్రెస్ నాయకుడు మధు యాష్కీకి అస్వస్థత.
మంత్రి శ్రీధర్ బాబును కలిసేందుకు సచివాలయానికి వచ్చి, ఛాతీ నొప్పితో కుప్పకూలిపోయిన మధు యాష్కీ.
చికిత్స నిమిత్తం గచ్చిబౌలి ఏఐజీ ఆసుపత్రికి తరలింపు..
మంగళవారం సాయంత్రం సచివాలయంలో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ మధు యాష్కీ గౌడ్ మంత్రి శ్రీధర్ బాబును కలవడానికి సచివాలయానికి వెళ్లారు. సమావేశం కొనసాగుతున్న సమయంలో ఆయన ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు. ఛాతి నొప్పితో కూలిపోయిన ఆయనను చూసి మంత్రి వెంటనే సిబ్బందిని అప్రమత్తం చేశారు. సచివాలయంలోని డిస్పెన్సరీ వైద్యులు ఫస్ట్ ఎయిడ్ చికిత్స అందించారు. ఆ తర్వాత హుటాహుటిన గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు..వైద్యులు ఆయన ఆరోగ్యాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం ఆయనకు అవసరమైన అన్ని వైద్య సదుపాయాలు కల్పిస్తున్నట్టు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. ఈ ఘటన వెలుగులోకి రాగానే కాంగ్రెస్ నాయకులు, అనుచరులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మధు యాష్కీ ఆరోగ్యం కుదుటపడాలని ఆకాంక్షిస్తూ పార్టీ శ్రేణులు ప్రార్థనలు చేస్తున్నారు..