మ‌హా కుంభమేళాకు ప్ర‌త్యేక బ‌స్సులు.. ఏపీఎస్ఆర్‌టీసీ.

*యూపీలోని ప్ర‌యాగ‌రాజ్‌లో జ‌రుగుతున్న మ‌హా కుంభమేళాకు ప్ర‌త్యేక బ‌స్సులు న‌డ‌ప‌నున్న‌ట్లు ఏపీఎస్ఆర్‌టీసీ ప్ర‌క‌టించింది*.

యాత్రికులకు ఆర్టీసీ బంపర్ ఆఫర్ ఇచ్చింది. ప్రయాగ్ రాజ్ కు వెళ్లడానికి ప్యాకేజీ టూర్ ప్రకటించింది.

విజ‌య‌వాడ నుంచి ఈ ప్ర‌త్యేక బ‌స్సులను ఏర్పాట్లు చేస్తున్న‌ట్లు జిల్లా ప్రజార‌వాణా అధికారి ఎంవై దానం సోమ‌వారం ఒక ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్నారు.

ఇక ఈ యాత్రలో ప్ర‌యాగ‌రాజ్‌ తో పాటు వార‌ణాసి,అయోధ్య పుణ్య‌ క్షేత్రాల‌ను ద‌ర్శించు కునేలా రానుపోను దాదాపు 3,600 కిలోమీట‌ర్లు, మొత్తం 8 రోజుల యాత్ర‌ను ప్లాన్ చేసిన‌ట్లు ఆయ‌న తెలిపారు. ఫిబ్ర‌వ‌రి 1 నుంచి 8వ తేదీ వ‌ర‌కు యాత్రను షెడ్యూల్ చేశారు.

ఫిబ్ర‌వ‌రి 1న ఉద‌యం విజ‌య‌వాడ పీఎన్‌బీఎస్ నుంచి ప్ర‌త్యేక బ‌స్సులు బ‌య‌ల్దేరుతాయి.2వ తేదీన సాయంత్రం ప్ర‌యాగ‌రాజ్‌కు చేరుకుంటాయి. 3వ తేదీన ప్ర‌యాగ‌రాజ్‌లోనే బ‌స చేయ‌డం జ‌రుగుతుంది.
4న రాత్రి నుంచి అయోధ్య‌కు ప్ర‌యాణం మొద‌ల‌వుతుంది.
5న ఉద‌యం అయోధ్య‌కు చేరుకుని, బాల రాముడి ద‌ర్శ‌నం అనంతరం రాత్రికి కాశీకి ప్రయాణం,6వ తేదీన వార‌ణాసికి చేరుకుని రాత్రికి అక్క‌డే బ‌స ఉంటుంది.
7న ఉద‌యం వార‌ణాసి నుంచి బ‌స్సులు బ‌య‌ల్దేరుతాయి.
8న బ‌స్సులు విజ‌య‌వాడ‌కు చేరుకుంటాయి.

*ఈ యాత్ర ప్ర‌త్యేక బ‌స్సుల్లో ఛార్జీలు ఇలా..*

సూప‌ర్ ల‌గ్జ‌రీ- రూ.8వేలు
స్టార్ లైన‌ర్ నాన్ ఏసీ స్లీప‌ర్‌- రూ.11వేలు, వెన్నెల ఏసీ స్లీప‌ర్‌- రూ.14,500

ఈ యాత్ర ప్ర‌త్యేక బ‌స్సుల్లో ఛార్జీలు పిల్ల‌ల‌కు, పెద్ద‌ల‌కు ఒకేలా ఉంటాయ‌ని ఆర్‌టీసీ అధికారులు వెల్ల‌డించారు. అలాగే త‌మ‌కు ఇచ్చేది కేవ‌లం బ‌స్సు ఛార్జీలు మాత్ర‌మేన‌ని తెలిపారు. భోజ‌నం, వ‌స‌తి, ఇత‌ర ఖ‌ర్చుల‌ను ప్ర‌యాణికులే భ‌రించాల్సి ఉంటుంద‌ని స్ప‌ష్టం చేశారు. ఇక యాత్రకు వెళ్ల‌ద‌ల‌చిన వారు 35, 29 మంది భ‌క్తులు స‌మూహంగా వ‌స్తే ప్ర‌త్యేక బ‌స్సులు ఏర్పాటు చేస్తామ‌న్నారు.

అలాగే ముంద‌స్తు రిజ‌ర్వేష‌న్ కోసం ఆన్‌లైన్‌, ఆర్టీసీ టికెట్ బుకింగ్ ఏజెంట్లు, స‌మీప బస్ స్టేష‌న్ల‌లో సంప్ర‌దించాల‌ని సూచించారు. మ‌రిన్ని వివ‌రాల‌కు 8074298487, 0866 2523926, 0866 2523928 నంబ‌ర్ల‌కు ఫోన్‌ చేసి తెలుసుకోవ‌చ్చ‌ని తెలిపారు.

కాగా, ఇప్ప‌టికే రాజ‌మ‌హేంద్ర‌వ‌రం, కొవ్వూరు నుంచి బ‌స్సులు ఏర్పాటు చేసిన‌ట్లు అధికారులు చెప్పారు. వాటిల్లో రిజ‌ర్వేష‌న్లు కూడా పూర్తయిన‌ట్లు పేర్కొన్నారు. ఇవి కూడా ఫిబ్ర‌వ‌రి 1వ తేదీ నుంచే బ‌య‌ల్దేరుతాయ‌ని ఆర్‌టీసీ అధికారులు వెల్ల‌డించారు..