బ్రహ్మంగారి కాలజ్ఞానం నిజమవుతుందా..! మూడు ఏండ్ల క్రితం నేల కూల్చిన తాటి చెట్టు దానంతట అదే.. దాని స్థానంలో లేచి నిల్చున్న ఆశ్చర్యకర ఘటన మహాబూబాబాద్ జిల్లా వేంనూరు గ్రామంలో చోటుచేసుకుంది…
ఇన్ని సంవత్సరాల తర్వాత ఈరోజు సాయంత్రం ఆశ్చర్యకరంగా ఆ తాటి చెట్టు లేచి నిల్చోని ఒక రకమైన శబ్దాలు చేస్తూ ఆ పక్కనే ఉన్న గుబ్బ చెట్టుపై వాల్చుకుందని ఆ ఘటనను కల్లరా చూసిన గొర్ల కాపర్లు, రైతులు వెల్లడించారు. ఒక్కసారిగా జరిగిన ఈ హఠాత్ పరిణామంతో భయభ్రాంతులకు గురై పరుగులు పెట్టినట్టు వారు తెలిపారు. ఈ ఘటన ప్రస్తుతం జిల్లాలో హాట్ టాపిక్‌గా మారగా.. ఈ వింతను తిలకించేందుకు ఆ గ్రామస్తులతో పాటు ఆ చుట్టుపక్కల ప్రజలు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుని వీక్షిస్తున్నారు. గ్రామానికి ఏమన్నా కీడు సోకనుందా అంటూ అక్కడి ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. బ్రహ్మంగారి కాలజ్ఞానం నిజమౌతుందా అంటూ వారి మధ్య చర్చ నడుస్తుండడం గమనార్హం..
గమనిక.. మీ ప్రాంతాల్లో A TO Z వార్తలు ఏదైనా..మాకు సమాచారం అందించండి.
వాట్సాప్..+91 91330 57959