మహారాష్ట్ర కాంగ్రెస్ పీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన నానా పటోలే…!

*🔹మహారాష్ట్ర కాంగ్రెస్ పీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన నానా పటోలే.*

101 స్థానాల్లో పోటీ చేసిన కాంగ్రెస్ కేవలం 16 స్థానాల్లోనే గెలిచి, ఘోర ఓటమికి బాధ్యత వహిస్తూ పీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన నానా పటోలే…

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ (Congress) పార్టీ ఘోర పరాజయం నేపథ్యంలో మహారాష్ట్ర పీసీసీ చీఫ్‌ (Maharashtra Congress chief) నానా పటోల్‌ (Nana Patole) తన పదవికి రాజీనామా చేశారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమికి బాధ్యత వహిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు రాజీనామా పత్రాన్ని హైకమాండ్‌కు పంపారు..2021లో నానా పటోల్‌ మహారాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఆయన నాయకత్వంలో కాంగ్రెస్ 17 స్థానాల్లో పోటీ చేసి ఏకంగా 13 స్థానాల్లో గెలుపొందిన విషయం తెలిసిందే.తాజా ఎన్నికల్లో ప్రతిపక్ష మహావికాస్‌ అఘాడీ (Maha Vikas Aghadi) కూటమి కేవలం 51 చోట్ల మాత్రమే విజయం సాధించింది. ఇక కూటమిలో భాగంగా 101 స్థానాల్లో పోటీ చేసిన కాంగ్రెస్‌ కేవలం 16 స్థానాల్లో మాత్రమే గెలుపొందింది…