ఇక రాజకీయాలకు గుడ్ బై.. మల్లారెడ్డి సంచలనం..

నేను రాజకీయంగా బీజేపీ వైపా…టీడీపీ వైపా..బీఆర్ఎస్ వైపా అన్నది కాదు.

నేను ఇప్పుడు బీఆర్ఎస్ లో ఉన్నా

నేను ఇప్పుడు ఏ వైపుకు చూసేటట్టు కూడా లేను.

నాకు 73 సంవత్సరాలు వచ్చాయి…ఇంకా ఏ వైపుకు చూడాల్సిన అవసరం ఏముంది.

ఎంపీ, మినిస్టర్, ఎమ్మెల్యే అయిన…ఇంకా మూడేళ్లు ఉంటా.

రాజకీయమే వద్దనుకుంటున్న.. ప్రజలకు సేవ చేసి మంచి కాలేజీలు, యూనివర్సిటీలు నడిపిద్దామని అనుకుంటున్న..
https://youtu.be/ITuVMMY2Iig?si=E_dnc_uFbV9Pi2rB
బీఆర్ఎస్ మాజీ మంత్రి, ఎమ్మెల్యే మల్లారెడ్డి గురించి తెలియని వారు ఎవరూ ఉండరు. ఆయన కామెడీ టైమింగ్ తో సోషల్ మీడియాలో ఓ హైప్ క్రియేట్ చేసుకున్నారు. ఆయన ఎక్కడ ఉన్నా ఇట్టే నవ్వులు పూయిస్తారు. తన విశిష్టమైన హాస్య శైలితో అందరినీ ఆకర్షిస్తారు. ఆయన హాస్యం, సమయస్ఫూర్తితో కూడిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. మాజీ మంత్రి, విద్యావేత్త, వ్యాపారవేత్త అయిన మల్లారెడ్డి తన చమత్కార వ్యాఖ్యలతో తరుచూ ట్రెండ్ అవుతుంటారు. గతంలో ఆయన అసెంబ్లీలో మాట్లాడిన కొన్ని వ్యాఖ్యలు సోషల్ మీడియాలో లక్షల్లో వ్యూస్ వచ్చాయి. ‘కష్టపడ్డా.. పాలమ్మిన.. పూలమ్మినా.. మంత్రి అయినా’ అని ఆయన మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో మస్త్ వైరల్ అయ్యాయి.. రాజకీయ విమర్శలతో పాటు, సినిమా ఈవెంట్‌లలో కూడా ఆయన వ్యాఖ్యలు వివాదాస్పదమై, సోషల్ మీడియాలో చర్చనీయాంశం అయ్యాయి… 7 3 ఏళ్ల వయసులోనూ ఆయన రాజకీయ, విద్యా, వ్యాపార రంగాల్లో చురుకుగా ఉంటూ, తన హాస్య చతురతతో అందరినీ అలరిస్తున్నారు. అయితే.. బీఆర్ఎస్ మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం తాను బీజీపీ వైపా.. టీడీపీ వైపా… బీఆర్ఎస్ వైపా అన్నది కాదు.. రాజకీయమే వద్దనుకుంటున్నానని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. కాలేజీలు, యూనివర్సిటీలు నడిపిద్దామని అనుకుంటున్నట్టు ఆయన చెప్పుకొచ్చారు.