మణిపుర్ ముఖ్యమంత్రి బీరెన్ సింగ్ రాజీనామా…!

మణిపుర్ ముఖ్యమంత్రి బీరెన్ సింగ్ రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా లేఖను గవర్నర్ అజయ్ భల్లాకు స్వయంగా అందించారు. గత కొన్నాళ్లుగా జాతుల మధ్య అల్లర్లతో రాష్ట్రం అట్టుడుకుతున్న సంగతి తెలిసిందే…ఇటీవల భద్రతా బలగాలు, నిరసనకారులకు మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. సీఎం అల్లుడి నివాసం సహా ముగ్గురు మంత్రులు, ఆరుగురు ఎమ్మెల్యేల నివాసాలపైనా దాడులు జరిగాయి. ఈ నేపథ్యంలోనే బీరెన్ సింగ్ రాజీనామా చేసినట్లు తెలుస్తోంది..

తనకు సహకరించిన కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నానని ఆయన (Manipur CM Resigns) అన్నారు.

మణిపూర్ అభివృద్ధికి కేంద్రం అనేక చర్యలు తీసుకుందని, రానున్న రోజుల్లోనూ ఈ అభివృద్ధి కొనసాగుతుందని ఆశిస్తున్నానని పేర్కొన్నారు. రాష్ట్రంలో నాయకత్వ మార్పు తథ్యమని కొన్ని రోజులుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో, ఆదివారం ఢిల్లీ వెళ్లిన బీరెన్ సింగ్.. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, అమిత్ షాలను కలిశారు. ఆ తరువాత సాయంత్రానికే ఆయన (Manipur CM Resigns) తన పదవికి రాజీనామా చేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది..