పంచాయతీ ఎన్నికలకు సిద్ధం కండి..స్థానిక సంస్థలు గ్రామ పంచాయతీ ఎన్నికలు…మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

సూర్యాపేట జిల్లా..
హుజూర్నగర్ నియోజకవర్గంలో నేడు మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు.. మొదటగా పట్టణంలోని డిగ్రీ ఇంటర్ కాలేజీలో సమస్యలపై అడిగి తెలుసుకుని,, కాలేజీ డెవలప్మెంట్ కి కావలసిన అంశాలపై చర్చించి అన్నిటిని త్వరలోనే పూర్తిచేసి విద్యార్థులకు అందించడం జరుగుతుందని అన్నారు.. అనంతరం
పాలకవీడు మండలంలో అలింగాపురం గ్రామంలో 30 కోట్లతో చేపడుతున్న రహదారి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ జనవరి ఫిబ్రవరి నెలలో జరగనున్నాయని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని మంత్రి ఉత్తమ్ పిలుపునిచ్చారు. రైతుల రుణమాఫీ పూర్తి చేస్తామని, రైతు భరోసా ఇస్తామని మంత్రి ఉత్తమ్ అన్నారు…జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కోదాడ హుజూర్ నగర్ ,నియోజకవర్గం అన్ని స్థానాల్లో క్లీన్ స్వీప్ చేయాలని అన్నారు. హుజూర్ నగర్ సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తానని ఏడుసార్లు నుంచి ఒకే ప్రాంతం నుంచి గెలిపించిన హుజూర్ నగర్ నియోజకవర్గ ప్రజలకు ఎల్లవేళలా రుణపడి ఉంటారని అన్నారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తేజస్ నందులాల్ పవర్, ఆర్డీవో శ్రీనివాసులు, ఆర్ అండ్ బి ఈఈ సీతారామయ్య,డిఇ రమేష్, మాజీ ఎంపీపీ గోపాల్, మోతిలాల్ నాయక్, సుబ్బారావు, కోదాడ డీఎస్పీ శ్రీధర్ రెడ్డి పాల్గొన్నారు.