‘నేను సంతోషంగా రాలేదురా బాలక, క్రోధంతో వచ్చాను’.. ‘రంగం’ (భవిష్యవాణి)..

మాతంగి స్వర్ణలత:

మౌనంగా ఉన్న మాతంగి స్వర్ణలత..

ఎందుకు చెప్పాలి, నేను సంతోషంగా రాలేదు, క్రోధంగా వచ్చా, ఎందుకు సమాధానం చెప్పాలి.

నా మాటలు ఆచరించనప్పుడు ఎందుకు సమాధానాలు చెప్పాలి.

రెండు మాసాలు అయిపోయాయి, విగ్రహ ప్రతిష్ఠ చేయడం లేదు.

నా ఆగ్రహానికి గురవుతున్నారు..

ఆపదలు వచ్చినా, ప్రమాదాలు వచ్చినా కాపాడుతున్నా.

నా మాట ఆచరించడం లేదు.

అడ్డుపుల్ల వేసిన తొలగిస్తా, ఎవరు అడ్డొచ్చిన తీసుకుపోతా.

నేను ఊరుకోను, విగ్రహ ప్రతిష్ఠ చేయాలి.

సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవాలు నగరంలో కన్నులపండువగా సాగుతున్నాయి. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే ఈ వేడుకల్లో అత్యంత కీలకమైన ఘట్టం ‘రంగం’ (భవిష్యవాణి). రెండో రోజు ఉత్సవాల్లో భాగంగా సోమవారం ఉదయం 9.55 గంటలకు దేవాలయ ప్రాంగణంలో పచ్చికుండపై నిలబడి, అమ్మవారు పూనిన మాతంగి స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు. ఈ విశేషాలను వినేందుకు వేలాదిగా భక్తులు ఆలయానికి పోటెత్తారు.
ఈ ఏడాది ఉత్సవాలు సంతృప్తికరంగా జరిగాయా అని ప్రధానార్చకులు ప్రశ్నించగా..రంగం భవిష్యవాణి అనంతరం బోనాల ఉత్సవాలు ముగియనున్నాయి. సాయంత్రం అమ్మవారిని అంబారీపై ఊరేగించనున్నారు. ఇందుకోసం ఆలయ అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఆలయ అధికారులు పర్యవేక్షిస్తున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. స్వర్ణలత కాసేపు మౌనంగా ఉండిపోయారు. అనంతరం ఆగ్రహంతో స్పందిస్తూ.. ‘నేను సంతోషంగా రాలేదురా బాలక, క్రోధంతో వచ్చాను’ అని పలికారు. ప్రతీ ఏటా భక్తులు చేసే పూజల పట్ల తాను కొంత అసంతృప్తితోనే ఉంటున్నానని, అయినా ఏ ప్రమాదం ముంచుకొచ్చినా తన బిడ్డలను కంటికి రెప్పలా కాపాడుకుంటున్నానని తెలిపారు. ఆలయంలో అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ చేస్తామని మాట ఇచ్చి, కాలయాపన చేయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విగ్రహ ప్రతిష్ఠకు ఎవరు అడ్డుపడినా ఊరుకునేది లేదని హెచ్చరించారు.