మావోయిస్టులపై కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా కీలక వ్యాఖ్యలు…!

మావోయిస్టులపై కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా కీలక వ్యాఖ్యలు.

2026 మార్చి 31 నాటికి దేశంలో మావోయిస్టులు లేకుండా చేస్తాం.

మావోయిస్టులతో మాట్లాడ్డానికి ఏమీ లేదు.

ఆయుధాలు వదిలేసి లొంగిపోతామంటే స్వాగతిస్తాం.

లొంగిపోయిన వారందరికీ పునరావసం కల్పిస్తాం.

శాంతికి విఘాతం కలిగిస్తే తగిన సమాధానం ఇస్తాం. -అమిత్‌ షా.

లొంగిపోయేందుకు మావోయిస్టులు ముందుకు వస్తే తాము స్వాగతిస్తామని హోంమంత్రి అన్నారు. లొంగిపోయిన వారందరికీ ప్రభుత్వం నుంచి అందాల్సిన వివిధ ప్రయోజనాలు అందిస్తామని, పునరావాసం కల్పిస్తామని హామీ ఇచ్చారు. బస్తర్‌ జిల్లాలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన హోంమంత్రి.. 2026 మార్చి 31 నాటికి దేశం మావోయిస్టు రహితంగా మారుతుందని చెప్పారు.

తమతో చర్చలు జరపాలని మావోయిస్టులు ప్రభుత్వాన్ని కోరుతున్నారని.. ఇప్పుడు వారితో మాట్లాడడానికి ఏముందని హోంమంత్రి వ్యాఖ్యానించారు. బస్తర్‌ అంతటా ఉన్న మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలను అభివృద్ధి చేయడానికి ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నాయన్నారు. ఈ ప్రాంతంలో ఆయుధాలతో శాంతికి విఘాతం కలిగించే వారికి భద్రతాదళాలు తగిన సమాధానం ఇస్తాయని ఆయన హెచ్చరించారు..