ఎన్కౌంటర్ 10 మంది మావోయిస్టులు మృతి..!

ఎన్కౌంటర్ 10 మంది మావోయిస్టులు మృతి

ఛత్తీస్ గఢ్ గరియాబంద్ గురువారం భద్రతా బలగాలు, మావోయిస్టులకు ఎదురుకాల్పులు జరిగాయి. కాల్పుల్లో పది మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. ఈ ఎన్కౌంటర్లో మావోయిస్ట్ కేంద్ర కమిటీ సభ్యుడు మనోజ్ అలియాస్ మోందం బాలకృష్ణ సైతం ఉన్నట్లు సమాచారం. రాయ్పూర్ రేంజ్ ఐజీ అమ్రేష్ మిశ్రా ఎన్కౌంటర్ను ధ్రువీకరించారు. భద్రతా దళాలు, నక్సల్స్ మధ్య ఎదురుకాల్పులు జరిగాయని.. ఇంకా కాల్పులు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు…

మృతుల్లో ఒరిస్సా రాష్ట్ర కమిటీ సభ్యుడు ప్రమోద్ యారఫ్ పాండు, మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు మనోజ్ అలియాస్ మోదెం బాలృష్ణ కూడా ఉన్నట్లు తెలిసింది. థానా మెయిన్ పూర్ ప్రాంతంలోని అడవుల్లో మావోయిస్టులు ఉన్నారనే సమాచారంతో భద్రతాదళాలు కూంబింగ్ నిర్వహించాయి. ఈ క్రమంలో ఎదురు కాల్పులు జరిగాయి. సంఘటన స్థలి నుంచి మృతదేహాలతోపాటు పెద్ద ఎత్తున ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

రాయ్‌పూర్ రేంజ్ ఐజీ అమ్రేష్ మిశ్రా మాట్లాడుతూ.. గరియాబంద్ ప్రాంతంలో భద్రతా దళాలు, నక్సల్స్ మధ్య ఎదురు కాల్పులు జరిగాయని, ఇంకా కాల్పులు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు..