అతి పెద్ద గిరిజన జాతర ఆయన మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు అడవి అంతా జనసంద్రంగా మారుతుంది. నాలుగు రోజులపాటు జరిగే మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, చతిస్గడ్, ఒరిస్సా, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాల నుండి కోట్లాదిగా భక్తులు తరలివస్తారు..అటువంటి మేడారం జాతర నాలుగు వారాల ముందే మేడారంలో ప్రారంభమవుతుంది.
మేడారం జాతరకు ప్రకృతి గ్రీన్ సిగ్నల్
అంతకుముందు ప్రకృతి కూడా మేడారం జాతరకు గ్రీన్ సిగ్నల్ పంపుతుంది. అడవిలో అద్భుతం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రంలోని ములుగు జిల్లాలో ఉన్న ఏటూరునాగారం ప్రాంతం అటవీ సంపదకు ప్రసిద్ధి చెందింది. తెలంగాణలోని అత్యంత పురాతన అభయారణ్యాల్లో ఒకటి అయిన ఈ ప్రాంతం ఏటూరునాగారం వన్యప్రాణి అభయారణ్యంగా 1953లో ప్రకటించబడింది.
వన్య ప్రాణుల నిలయం ఏటూరునాగారం అభయారణ్యం
మొత్తం 812చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం ఉన్న ఈ అభయారణ్యంలో ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం ఉంది. ఇక ఈ ప్రాంతంలోనే తెలంగాణ కుంభమేళాగా పిలిచే మేడారం సమ్మక్క సారలమ్మల జాతర ఘనంగా జరుగుతుంది. గోదావరి నది పరివాహక ప్రాంతంలో ఉన్న ఈ అడవిలో ఒకప్పుడు పులులు సంచరించేవి. ప్రస్తుతం ఇక్కడ చిరుతలు, ఎలుగుబంట్లు, అడవి కుక్కలు, అడవి దున్నలు, సాంబర్, నీల్ గాయ్, పాములు, తేళ్లు, ఎన్నోరకాల పక్షులు ఉన్నాయి.
అమ్మల రాకకు అడవి సంసిద్ధం
ఈ అటవీ ప్రాంతంలోనే మేడారం సమ్మక్క సారలమ్మ జాతర రెండేళ్లకోసారి అద్భుతంగా జరుగుతుంది. జాతర ప్రారంభానికి ముందు అడవి కూడా అమ్మవారి రాకకు తన సంసిద్ధతను వ్యక్తం చేస్తుంది అని ఇక్కడ ఉన్న గిరిజన కోయలు చెబుతారు. జాతరకు ముందు గిరిజన సాంప్రదాయాల ప్రకారం అడవిని కూడా ఎలాంటి అపవిత్రత లేకుండా చూస్తారు. చెట్లు నరకడం గాని, ప్రకృతికి హాని చేయడం కానీ చేయరు.
అడవి శుద్ధితో మారే వాతావరణం
కొన్నిచోట్ల ఆచార బద్ధంగా అగ్ని కార్యక్రమాలు నిర్వహించి, అడవి శుద్ధి తో పాటు, దుష్ట శక్తులు రాకుండా చూస్తారు.ఇక అమ్మవారి రాకకు ముందు అడవిలో అద్భుతం జరుగుతుందని ఇక్కడ గిరిజనులు బలంగా నమ్ముతారు. ఆకాశం నిర్మలంగా మారుతుందని, అడవిలో గాలిలో మార్పు వస్తుందని, చల్లని గాలులు ఆహ్లాదకరంగా తాకుతాయని నమ్ముతారు.
భక్తులకు హాని చెయ్యని జంతువులు, పక్షులు
అంతేకాదు మేడారం అటవీ ప్రాంతం అంతా జనసంద్రంగా మారే వేళ వన్యప్రాణులన్నీ దట్టమైన అడవి లోపలికి వెళ్లిపోతాయని, అవి ఇక్కడికి వచ్చే భక్తులకు ఎటువంటి హాని చేయవని బలంగా విశ్వసిస్తారు. ఇక్కడ పాములు, తేళ్లు, కొండచిలువలు ఏవీ ప్రజలకు హాని చేయవని చెబుతారు. ఇప్పటివరకు ఇంతకాలంగా మేడారం జాతర జరుగుతున్నా ఇక్కడ ఉన్న జంతువులు, పాముల కారణంగా ఒక్కరు కూడా చనిపోయిన దాఖలాలు లేవన్నది అందరూ ఒప్పుకునే గొప్ప విషయం.
మేడారం సమ్మక్క సారలమ్మ జాతర చరిత్ర.. ఆశ్చర్యకర విషయాలు!
అడవి అందించే ఆతిధ్యం
అడవి నిశ్శబ్దంగా అమ్మల విషయంలో భక్తి తన్మయత్వంతో కనిపించడం, కోట్ల కొద్ది జనం తండోపతండాలుగా వచ్చినా ఎవరూ ఇబ్బంది పడకపోవడం ఈ జాతర యొక్క గొప్పతనం. ఇది జాతరకు వచ్చే భక్తులందరికీ అడవి అందించే ఆతిథ్యం..
సోమవారం పగిడిద్దరాజు గర్భగుడి వద్ద పడగ (జెండాలకు)లు, పురాతన ఆభరణాలకు మేడారం ట్రస్ట్ చైర్పర్సన్ ఇర్ప సుకన్య, మాజీ చైర్మన్ అరెం లచ్చుపటేల్, సమ్మక్క ప్రధాన పూజారి సిద్దబోయిన స్వామి పగిడిద్దరాజుకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పాదయాత్ర చేస్తూ మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం పూనుగొండ్ల నుంచి పెనక వంశీయులను కలుపుకొని మేడారం వెళ్లడమనేది ఏండ్లుగా కొనసాగుతోంది. ఈ రాత్రి కొడిశల గ్రామంలో, మంగళవారం జంపన్నవాగులో బసచేస్తారు. – MEDARAM JATHARA
మేడారం జాతర కేవలం దేవతల రాక మాత్రమే కాదు, అది ఆదివాసీ సంప్రదాయాల కలయిక. సమ్మక్క భర్త అయిన పగిడిద్దరాజును మేడారానికి తీసుకురావడానికి పూనుగొండ్ల గ్రామంలోని గిరిజనులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. పురాతన కాలం నాటి ఆచారాల ప్రకారం, పగిడిద్దరాజును పెళ్లికొడుకుగా అలంకరించి, మేళతాళాలు, డప్పు వాయిద్యాల మధ్య మేడారం వైపు కాలినడకన బయలుదేరుతారు. ఈ పవిత్ర యాత్ర సుమారు 5060 కిలోమీటర్ల మేర అటవీ మార్గంలో సాగుతుంది. గిరిజన పూజారులు పగిడిద్దరాజు రూపమైన పవిత్ర వెదురు కర్రను, ఆభరణాలను భుజాలపై మోస్తూ అడవి మార్గాల గుండా ప్రయాణిస్తారు. మార్గమధ్యంలో వేలాది మంది భక్తులు పగిడిద్దరాజుకు నీరాజనాలు అర్పిస్తూ, కాళ్లు కడిగి మొక్కులు తీర్చుకుంటారు.పగిడిద్ద రాజును తీసుకురావడం ఒక సాహసోపేతమైన యాత్ర. పెనక వంశీయులు దట్టమైన అడవుల గుండా, కొండలు, వాగులు దాటుకుంటూ సుమారు 50 నుండి 60 కిలోమీటర్లు కాలినడకన మేడారం చేరుకుంటారు. ఈ ప్రయాణంలో వారు ఎక్కడా ఆగరు, కనీసం చెప్పులు కూడా ధరించరు. గ్రామస్తులు దారిపొడవునా వారికి హారతులు పడుతూ స్వాగతం పలుకుతారు. భార్య సమ్మక్కను కలిసేందుకు భర్త వెళ్తున్నాడనే భావనతో ఈ యాత్రను అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తారు. ఇది చూసేందుకు రెండు కళ్లు చాలవు.
పగిడిద్దరాజుతోపాటు కొండాయిగూడెం నుంచి గోవిందాజును, కన్నెపల్లి నుంచి సారలమ్మను ఆయా గ్రామాల పూజారులు తీసుకొస్తారు. ఆ ముగ్గురు వనదేవతలకు మేడారంలోని గర్భగుడిలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. బుధవారం పగిడిద్దరాజును గద్దెలపై నియమ నిష్టలతో ప్రతిష్ఠిస్తారు. గురువారం సమ్మక్క(దేవత)ను చిలకలగుట్ట నుంచి గద్దెల మీదకు తీసుకురావడంతో మేడారం మహాజాతర ప్రారంభమవుతుంది. శుక్ర, శనివారం భక్తులు వనదేవతలను దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటారు. తిరగి సమ్మక్కను శనివారం సాయంత్రం పూజారులు(వడ్డెలు) చిలకలగుట్టకు తీసుకెళతారు. అరెం వంశీయులు పగిడిద్దరాజును పాదయాత్రతో గుండాలకు చేర్చుతారు. దీంతో జాతర ముగుస్తుంది.
పగిడిద్ద రాజు ఆభరణాలు – గుర్తులు
వెండి బెత్తం (రాజదండం): ఇది పగిడిద్ద రాజు అధికారానికి, పాలకుడి హోదాకు గుర్తు. దీనిని పెనక వంశస్థులు అత్యంత భక్తితో పట్టుకుని నడుస్తారు.
వెండి గొడుగు (ఛత్రం): రాజుకు ఇచ్చే గౌరవ సూచికగా వెండి గొడుగును ఆయన చిహ్నాలపై పెడతారు.
ముత్యాల గుత్తులు, పట్టు వస్త్రాలు: రాజు అలంకరణ కోసం పురాతన కాలం నాటి ముత్యాల హారాలు, ఎరుపు రంగు పట్టు వస్త్రాలను ఉపయోగిస్తారు.
కుంకుమ భరిణె: సమ్మక్క లాగే పగిడిద్ద రాజుకు కూడా ప్రత్యేకమైన భరిణె ఉంటుంది.
జాతరలో పగిడిద్ద రాజు ప్రాముఖ్యత
జాతర మొదటి రోజున సారలమ్మ గద్దెపైకి వచ్చిన తర్వాతే పగిడిద్ద రాజును ప్రతిష్ఠిస్తారు. భర్త (పగిడిద్ద రాజు), కుమార్తె (సారలమ్మ), అల్లుడు (గోవిందరాజు) ముగ్గురూ మొదటి రోజే గద్దెలపైకి చేరుకుంటారు. వీరంతా సమ్మక్క రాక కోసం ఎదురుచూస్తుంటారు. రెండో రోజు సమ్మక్క రాగానే ఈ గిరిజన యోధుల కుటుంబం అంతా ఒకే చోట కొలువుదీరుతుంది. ఈ దృశ్యాన్ని చూడటానికే భక్తులు లక్షలాదిగా తరలివస్తారు.పగిడిద్ద రాజును తీసుకువచ్చే హక్కు కేవలం పెనక వంశీయులకు మాత్రమే ఉంటుంది. వీరిని ‘వడ్డెలు’ అని కూడా పిలుస్తారు. ఈ వంశానికి చెందిన పెద్దలు చనిపోతే, వారి వారసులే ఈ బాధ్యతను స్వీకరిస్తారు. ఈ ఆచారం కొన్ని వందల ఏళ్లుగా చెక్కుచెదరకుండా కొనసాగుతోంది.
28న గద్దెలపైకి పగిడిద్దరాజు చేరిక
నేడు ప్రారంభమైన ఈ పయనం అడవి దారుల గుండా సాగుతూ, ఈ నెల 28వ తేదీ నాటికి మేడారం గద్దెలకు చేరుకుంటుంది. సమ్మక్క రాకకు ముందే ఆమె భర్త గద్దెపైకి చేరుకోవడం ఇక్కడి ఆచారం. పగిడిద్దరాజుతో పాటు గోవిందరాజులు (సమ్మక్క అల్లుడు) కూడా కొండాయి గ్రామం నుంచి మేడారానికి చేరుకుంటారు. వీరి రాకతోనే జాతర ప్రాంగణంలో అసలైన ఆధ్యాత్మిక వాతావరణం మొదలవుతుంది. జాతరలో మొదటి రోజు సారలమ్మ గద్దెపైకి చేరుకుంటే, రెండో రోజు సమ్మక్క తల్లి చిలుకలగుట్ట నుంచి దిగివస్తుంది. అయితే, పగిడిద్దరాజు రాక అనేది ఈ కుటుంబం మొత్తాన్ని ఒకే చోట చేర్చే ప్రక్రియలో భాగంగా ఉంటుంది. ఆదివాసీల ఆచారాల ప్రకారం, ఈ దేవతలందరూ గద్దెలపై కొలువుదీరినప్పుడే భక్తులు తమ కోరికలను మొక్కుల రూపంలో సమర్పించుకుంటారు. ఇది ప్రకృతికి, మనిషికి మధ్య ఉండే అవినాభావ సంబంధానికి ప్రతీక.
ఈ అద్భుత ఘట్టాన్ని వీక్షించేందుకు తెలుగు రాష్ట్రాలతో పాటు ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఒడిశా దేశం నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివస్తున్నారు. పూనుగొండ్ల నుంచి మేడారం వరకు సాగే ఈ యాత్ర మార్గంలో ఎక్కడా ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు మంచినీరు, వైద్య సదుపాయాలను ఏర్పాటు చేశాయి. పగిడిద్దరాజు పయనం సాగే దారి పొడవునా భక్తుల జయజయధ్వానాలతో అడవి మొత్తం ప్రతిధ్వనిస్తోంది. మేడారం మహాజాతర కేవలం ఒక ఉత్సవం మాత్రమే కాదు, ఇది అన్యాయంపై పోరాడిన వీరవనితల చరిత్ర. సమ్మక్క-సారలమ్మల త్యాగాలను స్మరిస్తూ, పగిడిద్దరాజు వంటి వీరులను పూజించడం గిరిజన సంస్కృతిలోని గొప్పతనాన్ని చాటుతుంది. నేటి నుంచి ప్రారంభమైన ఈ పవిత్ర యాత్ర, మేడారంలో దేవతలు కొలువుదీరే వరకు ప్రతి క్షణం భక్తి పారవశ్యంలో ముంచెత్తుతుంది…