మేడ్చల్లోని టెక్ మహీంద్రా కంపెనీ ముందు ధర్నాకు దిగిన సాఫ్ట్వేర్ ఉద్యోగిని భావన
తనను అకారణంగా జాబ్లో నుంచి తీసివేశారని, పాపకు ఆరోగ్యం బాగాలేదని 3 రోజులు సెలవు కావాలని కోరితే ఉద్యోగం నుంచి తీసేశారని భావన ఆవేదన..
ఆరోగ్యం బాగాలేక కంపెనీలో పడిపోతే కనీసం పట్టించుకోలేదని, 14 రోజులు ట్రీట్మెంట్ తీసుకుంటే ఆ సమయంలో కూడా ఉద్యోగంలో నుంచి తీసేస్తామని బెదిరించారని యాజమాన్యంపై ఆగ్రహం..
ఉద్దేశపూర్వకంగానే తనను జాబ్లో నుంచి తీసేశారని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు..
తనకు న్యాయం కావాలని కంపెనీ ముందు ధర్నాకు దిగిన భావన..
తన చిన్నారికి ఆరోగ్యం బాగాలేక మూడు రోజుల సెలవు కావాలని కోరినందుకే ఉద్యోగం నుంచి తొలగించారని భావన ఆవేదన వ్యక్తం చేశారు. కంపెనీలో పని చేస్తున్న సమయంలో తన ఆరోగ్యం కూడా బాగాలేక కిందపడిపోయినా యాజమాన్యం కనీసం పట్టించుకోలేదని ఆరోపించారు.
అనంతరం 14 రోజుల పాటు చికిత్స తీసుకున్న సమయంలో కూడా ఉద్యోగం నుంచి తొలగిస్తామని బెదిరించారని ఆమె వాపోయారు. తనను ఉద్దేశపూర్వకంగానే ఉద్యోగం నుంచి తొలగించారని ఆరోపిస్తూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.