బాధ్యత మరిచిన మీడియా… రేటింగ్ కోసం బ్రతికున్న వ్యక్తినే చంపేస్తోంది..!

బాధ్యత మరిచిన మీడియా… రేటింగ్ కోసం బ్రతికున్న వ్యక్తినే చంపేస్తోంది..!

ఒకప్పుడు మీడియా అంటే నిజం చెప్పే వేదిక. ప్రజల గొంతుక. కానీ నేడు కొంతమంది కోసం వార్త కంటే వ్యూస్, నిజం కంటే TRP, బాధ్యత కంటే బ్రేకింగ్ ముఖ్యమైపోయాయి.

ధృవీకరణ లేకుండా “మరణించాడు”, “షాకింగ్”, “బ్రేకింగ్” అంటూ వార్తలు ప్రసారం చేస్తే… ఆ వార్తలో కనిపించే వ్యక్తి మాత్రమే కాదు, అతని కుటుంబం, స్నేహితులు, బంధువులు కూడా తీవ్ర ఆందోళనకు గురవుతారు.

అలాంటి ఘటనే ప్రస్తుతం కూడా బిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విషయంలో కూడా జరిగింది.. పరిస్థితి విషమంగా ఉండడంతో ఎమర్జెన్సీగా ఆసుపత్రికి తరలించారు.. ఈ లోపే ప్రముఖ మీడియా పత్రికలు, టీవీ ఛానళ్లు పెద్ది సుదర్శన్ రెడ్డి చనిపోయారు అంటూ వార్తలను స్ప్రెడ్ చేశాయి.. బాధ్యత కలిగిన కార్పొరేట్ మీడియా కూడా ఇలా చేయడం సామాన్యసమేనా అంటూ కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు… నిజంగా ఆ కుటుంబంలో ఎవరైనా ఆ వార్తలు చూసి ఉంటే వారి పరిస్థితి ఎలా ఉండేదో అని ఆలోచన కూడా పలువురు వ్యక్తం చేస్తున్నారు.. వేగంగా సమాచారం అందించడం ముఖ్యమే కానీ అందులో నిజమెంతో తెలుసుకొని అందిస్తే బాగుంటుంది అని అందరి అభిప్రాయం.

ఒక తప్పుడు వార్త వల్ల ఒక కుటుంబం అనుభవించే మానసిక వేదనకు ఎవరు బాధ్యత వహిస్తారు?

మీడియా స్వేచ్ఛ గొప్పది… కానీ బాధ్యత అంతకంటే గొప్పది.

రేటింగ్ కోసం నిజాన్ని పక్కన పెట్టి, మనుషుల జీవితాలతో ఆడుకోవడం జర్నలిజం కాదు. ప్రతి వార్తకు ముందు నిజానిజాలు నిర్ధారించడం మీడియా యొక్క మొదటి కర్తవ్యం.

వేగం కంటే వాస్తవం ముఖ్యం.
రేటింగ్ కంటే బాధ్యత ముఖ్యం.
సంచలనం కంటే సత్యం ముఖ్యం…

ఇది మేము ఎవరిపై విమర్శలు చేయడానికి ఇలా వార్త రాయడం లేదు ఇలాంటి ఎన్నో వార్తలు , అద్భుతాలను తెలుగు మీడియాలు ప్రచురించి ఉండొచ్చు కానీ వ్యక్తి మరణం పట్ల తొందరపాటు వద్దు అనేదే మా అభిప్రాయం..