బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడిన అల్పపీడనం..!

బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడిన అల్పపీడనం.

24 గంటల్లో తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం
రేపు పారాదీప్-సాగర్ ద్వీపాల మధ్య తీరం దాటే అవకాశం.

ఉత్తరాంధ్ర తీరంలో గంటకు 55-65 కి.మీ. వేగంతో గాలులు.

సముద్రంలో అలలు ఎగసిపడే అవకాశం
చిన్న పడవలతో సముద్రంలోకి వెళ్లొద్దు-అధికారులు
బుధవారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్లొద్దు
తీరప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి-అధికారులు..

బంగాళాఖాతంలో వాయుగుండం బలపడింది.. తీరప్రాంతాలకు హెచ్చరిక.

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడింది. ఇది రానున్న 24 గంటల్లో మరింత బలపడి తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అనంతరం పారాదీప్–సాగర్ ద్వీపాల మధ్య రేపు తీరం దాటే అవకాశముందని అధికారులు వెల్లడించారు.
దీని ప్రభావంతో ఉత్తరాంధ్ర తీరంలో గంటకు 55–65 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. సముద్రం అల్లకల్లోలంగా మారి భారీ అలలు ఎగసిపడే పరిస్థితులు నెలకొనవచ్చని హెచ్చరించారు.
ఈ నేపథ్యంలో చిన్న పడవలతో సముద్రంలోకి వెళ్లవద్దని, అలాగే బుధవారం వరకు మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదని అధికారులు సూచించారు. తీరప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, స్థానిక అధికారుల సూచనలు తప్పనిసరిగా పాటించాలని విజ్ఞప్తి చేశారు.