రేపు దేశవ్యాప్తంగా మందుల దుకాణాలు బంద్‌.

రేపు దేశవ్యాప్తంగా మందుల దుకాణాలు బంద్‌.

అడ్వైజరీ జారీ చేసిన తెలంగాణ డ్రగ్‌ కంట్రోల్‌ అడ్మినిస్ట్రేషన్‌. అత్యవసర మందులు ముందుగానే తెచ్చుకోవాలని సూచన.

బంద్‌కి కారణాలివే..

ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లు డాక్టర్ల ప్రిస్క్రిప్షన్లను సరిగ్గా వెరిఫై చేయకుండానే యాంటీబయాటిక్స్, ఇతర తీవ్రమైన మందులను విక్రయిస్తున్నాయని కెమిస్ట్‌లు ఆరోపణలు వ్యక్తం చేస్తున్నారు. ఇ-ఫార్మసీలు ఇస్తున్న భారీ డిస్కౌంట్ల వల్ల స్థానిక, సాంప్రదాయ రిటైల్ మందుల దుకాణాలు తీవ్రంగా నష్టపోతున్నాయని ఆవేదన వెలిబుచ్చారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి సృష్టించే నకిలీ ప్రిస్క్రిప్షన్ల వల్ల ప్రజారోగ్యానికి ముప్పు వాటిల్లుతోందని అసోసియేషన్ ఆందోళన వ్యక్తం చేసింది.