కాళేశ్వరం దగ్గర పెరుగుతున్న గోదావరి వరద ఉధృతి… మేడిగడ్డ 85 గేట్లు ఎత్తి దిగువకు నీరు విడుదల…!

కాళేశ్వరం దగ్గర పెరుగుతున్న గోదావరి వరద ఉధృతి…
మేడిగడ్డ 85 గేట్లు ఎత్తి దిగువకు నీరు విడుదల..
ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో 3,30,830 క్యూసెక్కులు..

గోదావరి పరివాహక ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీకి వరద నీరు వచ్చి చేరుతోంది , దీనితో అధికారులు బ్యారేజీ 85 గేట్లను తెరిచి వ్యర్థాలను దిగువకు విడుదల చేశారు. ఈరోజు మధ్యాహ్నం నుండి బ్యారేజీ నుండి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు…

అన్నారం బ్యారేజీకి 3లక్షల 30వేల 543 క్యూసెక్కుల వరద రావడంతో 66 గేట్ల ద్వారా అంతే స్థాయిలో నీటిని అధికారులు దిగువకు పంపిస్తున్నారు. కాగా గత మూడు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టులన్ని నిండుకుండలా మారాయి. భారీ వర్షాల నేపపథ్యంలో అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకి రావొద్దని అధికారులు హెచ్చరించారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. .