ఆదాయం పెంచడంలో ఆలోచన అద్భుతం..వీఐపీలూ టికెట్లు కొనుగోలు చేసేలా ఓ వినూత్న కార్యక్రమం..మేసేజ్ ద్వారా ఛాలెంజ్..
సూర్యాపేట జిల్లా..
శ్రీ స్వయంభూ శంభు లింగేశ్వర స్వామి ఈ ఆలయం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.. కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారం ఈ స్వామి… ఈ ప్రాంతానికి దక్షిణ కాశీగా కూడా పేరు ఉంది.. నిత్యం నెత్తిన గంగతో ఉండే శివలింగం ఇక్కడ ప్రత్యేకత..
ఆదాయం పెంచడంలో ఆలోచన అద్భుతం..

మేళ్లచెరువు స్వయంభు శంభులింగేశ్వర స్వామి కల్యాణోత్సవాల సందర్భంగా ఈసారి స్వామి వారి దర్శనానికి వచ్చే వీఐపీలూ టికెట్లు కొనుగోలు చేసేలా ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఏటా ఈ వేడుకల సంద ర్భంగా ఆలయంలో వీవీఐపీ, వీఐపీల దర్శనానికి ప్రత్యేక మార్గాలను ఏర్పాటు చేసేవారు. ఆ మార్గాల్లో వారు వచ్చి స్వామివారిని దర్శించుకుని వెళ్లేవారు. ఐతే వారొచ్చే ఆ మార్గాల్లోనే వీఐపీల కుటుంబ సభ్యులంటూ ఇతరులు నిత్యం వందల సంఖ్యలో గర్భాలయం లోకి ప్రవేశించి స్వామి వారిని దర్శించుకునే వారు. వారి వల్ల సాధారణ భక్తులూ తీవ్ర అసౌ కర్యానికి గురయ్యేవారు.. ఈసారి అలాంటి పరి స్థితులు పునరావృతమవ్వ కుండా, ఆలయ ఆదాయ మార్గాన్వేషణలో భాగంగా మూడు రోజుల ముందునుంచే వీఐపీ చాలెంజ్ టికెట్లను జారీ చేస్తు న్నారు. ఈ క్రమంలో ఆలయ చైర్మన్, ఈవో, కొందరు ధర్మకర్తలు, పెద్దలు ఈ వీఐపీ టికెట్లను కొనుగోలు చేస్తున్నారు. ఒక్కొక్క టికెటును రూ.200 చొప్పున కొనుగోలు చేస్తూ. తాము ఈసారి ఉచిత దర్శనం చేసుకోవట్లేదని పేర్కొంటూ.. మీరూ ఇలాగే కొనుగోలు చేయాలని స్నేహితులు, శ్రేయోభిలాషు లకు మేసేజ్ ద్వారా ఛాలెంజ్ విసురుతు న్నారు. ఆలయానికి ఆదాయం వచ్చే విధంగా ఇది తమవంతు ప్రయత్నమని పేర్కొంటుండటంతో ఒకరిని చూసి ఇంకొ కరు ఈ టిక్కెట్లను తీసుకునేందుకు ఉత్సాహం కనబరుస్తున్నారు. వీఐపీ ఛాలెంజ్ టికెట్ల ద్వారా ఈసారి ఆలయ ఆదాయం ఇంకొంచెం పెరిగే అవకాశం ఉందని ఆలయ చైర్మన్ శంభిరెడ్డి, ఈవో కొండారెడ్డి, ధర్మకర్తలు నర్సింహారావు తదితరులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు…
ఇక్కడ మరో విషయం ఏమిటంటే.. విఐపి. వివీఐపీలతోనే ఆదాయ మార్గాన్ని ఎంచుకోవడం కొత్త రకం ఆలోచనే..
అంతేకాకుండా మామూలు భక్తుల దర్శనానికి కూడా సపరేట్గా మరో దర్శన ద్వారాన్ని కూడా ఏర్పాటు చేయడంతో భక్తులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు… ఆలయంలో అందరూ సమానులే అనడానికి ఇదో చిన్న నిదర్శనం అంటూ పలువురు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు..