హైదరాబాద్‌లో ఎంఐఎం కార్పొరేటర్లు హల్ చల్ చేస్తున్నారు.. భోలక్‌పూర్ కార్పొరేటర్ ఘటన మరువక ముందే… ఓల్డ్ సిటీలో మరో ఎంఐఎం కార్పొరేటర్ వ్యవహారం హాట్ టాపిక్‌గా మారిపోయింది.. చార్మినార్ యునాని ఆసుపత్రి ముందు నో పార్కింగ్ ఏరియాలో.. తన వాహనాన్ని పార్క్ చేశాడు. మక్కా మసీదు ప్రాంతంలో ట్రాఫిక్ జామ్ కావడంతో.. వెహికల్స్ పార్కింగ్ కోసం యునాని హాస్పిటల్ గేట్లు తెరిపించాడు కార్పొరేటర్ సయ్యద్ సొహైల్ ఖాద్రి.. అయితే, దీనిపై పోలీసులకు సమాచారం చేరవేశారు పోలీసులు.. డయల్ 100కు ఫోన్ చేసి ఫిర్యాదు చేశారు.. ఇక, ఫోన్ కాల్‌తో రంగంలోకి దిగారు ఎస్సై.. ఘటనా స్థలానికి చేరుకున్నారు.. అయితే, ఎస్సైతో వాగ్వాదానికి దిగాడు ఎంఐఎం కార్పొరేటర్.. ఎస్సైని పట్టుకుని నానా హంగామా చేశాడు.. అసలు మీకు ఇక్కడ ఏం పని.. ఎందుకొచ్చారంటూ నిప్పులు చెరిగాడు.. ఇక్కడ ఇలాగే చేస్తామంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగిన కార్పొరేటర్…తాజాగా ముషీరాబాద్‌లో పోలీసులపై దౌర్జన్యానికి పాల్పడిన భోలక్‌పూర్ ఎంఐఎం కార్పొరేటర్‌ను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.. మంగళవారం భోలక్‌పూర్‌లో అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా ఫాస్ట్ ఫుడ్ సెంటర్ తెరిచి ఉంచడం.. షాపును క్లోజ్ చేయాలని పోలీసులు సూచించడంతో ఎంఐఎం కార్పొరేటర్ గౌస్ రెచ్చిపోయారు.. తన ఇలాకాలో పోలీసులు అడుగు పెట్టొద్దంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాకు ఎక్కి రచ్చ చేసింది… దీంతో మంత్రి కేటీఆర్ పోలీసులతో దురుసుగా వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ ట్విట్టర్ వేదికగా అధికారులను ఆదేశించడంతో.. ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు.. ఐపీసీ 353, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేసిన విషయం విదితమే.. మరి ఎప్పుడు చార్మినార్ దగ్గర రచ్చ చేసిన కార్పొరేటర్ వ్యవహారంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి మరి… మరోవైపు.. హైదరాబాద్ పోలీసులపై హాట్ కామెంట్లు చేశారు హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ.. రేవ్ పార్టీ, డ్రగ్స్ కేసు వ్యవహారంపై సోషల్ మీడియా వేదికగా స్పందించిన ఆయన.. పబ్ నిర్వాహకుడిని అరెస్ట్ చేసి.. బడా బాబుల పిల్లలను వదిలిపెట్టారని ఆరోపించారు.. పెద్దలకు ఓ న్యాయం.. పేదలకు ఓ న్యాయమా? అంటూ నిలదీస్తూ.. మంత్రి కేటీఆర్, హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌కు ట్యాగ్ చేసిన విషయం తెలిసిందే…
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.