నెల్లూరులో మంత్రి ఆనం రామానారాయణ పర్యటన.
ఆలయాల్లో తప్పులు జరిగితే ఎంతటి వారైనా వదిలిపెట్టం.
ద్రాక్షారామం ఆలయ ఘటనలో నిందితుడిని పట్టుకున్నాం.
నంద్యాలలో నకిలీ వెండి ఆభరణాలపై విచారణకు ఆదేశించాం.
ఆభరణాలు స్వామివారికి చేరేవరకు వదిలిపెట్టం అన్నారు…
ముక్కోటి రోజు భక్తుల సంఖ్య భారీగా పెరిగింది-ఆనం.
కోనసీమ జిల్లా ద్రాక్షారామంలోని బీమేశ్వరస్వామి ఆలయంలో శివలింగాన్ని ధ్వంసం చేయడం ద్వారా హైందవుల మనోభావాలు దెబ్బదీశారని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మండిపడ్డారు. ఈ ఘటనకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని జిల్లా ఉన్నతాధికారులను ఆదేశించామన్నారు. సీసీ కెమెరా ఆధారంగా దోషులను గుర్తిస్తున్నట్లు తెలిపారు. బుధవారం నెల్లూరులో టీడీపీ జిల్లా అధ్యక్షుడు బీద రవి చంద్ర, స్థానిక లోక్సభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో కలిసి మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి విలేకర్లతో మాట్లాడారు. బైక్పై వచ్చిన వ్యక్తి తనని గుర్తు పట్టకుండా.. ముఖాన్ని దాచుకొని వచ్చినట్టు నిర్దారణకు అధికారులు వచ్చారన్నారు. ఆలయంలో వ్యక్తిపై ఉన్న కోపాన్ని ఇలా విధంగా చూపినట్టు గుర్తించారని పేర్కొన్నారు. ప్రత్యామ్నాయ శివలింగన్ని ఏర్పాటు చేసి పూజలు జరిపించారని వివరించారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహంతో ఉన్నారని చెప్పారు..
ఇక నంద్యాలలోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో దేవుడి అలంకరణ కోసం వినియోగించే వస్తువులు నకిలీ వెండి వస్తువులని తేలిందన్నారు. వెండి ఆభరణాలు.. ఎలా నకిలీ వస్తువులుగా మారాయనే దానిపై విచారణ జరిపిస్తున్నామని పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై కేసులు నమోదు చేయాలని ఇప్పటికే ఎండోమెంట్ అధికారులకు ఆదేశించామని గుర్తు చేశారు…
రామరాజ్య స్థాపనకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు పెద్ద పీట వేస్తున్నారని స్పష్టం చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ సిక్స్ పధకాలన్నింటిని కూటమి ప్రభుత్వం అమలు చేస్తుందని పునరుద్ఘాంటించారు. రాష్టంలో అభివృద్ధి, సంక్షేమం.. రెండు ఒకదానితో మరొకటి పోటీపడుతున్నారు. ప్రజలకి రూ. వేల కోట్లు అనేక పధకాలు ద్వారా పంపిణీ చేశామన్నారు..
గమనిక.. మీ ప్రాంతాల్లో A TO Z వార్తలు ఏదైనా..మాకు సమాచారం అందించండి.
వాట్సాప్..+91 91330 57959