ధరణి ని ప్రక్షాళన చేసి భూభారతి ని తీసుకొచ్చి సామాన్య రైతులకు ప్రభుత్వం మేలు… మంత్రి శ్రీనివాస్ రెడ్డి..

...

ధరణి ని ప్రక్షాళన చేసి భూభారతి ని తీసుకొచ్చి సామాన్య రైతులకు ప్రభుత్వం మేలు చేసిందని రాష్ట్ర రెవెన్యూ, హోసింగ్ సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. శనివారం గద్వాల నియోజకవర్గం లోని దరూర్ మండల కేంద్రం లో ఎమ్మెల్యే కృష్ణ మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన రైతు అవగాహన సదస్సు కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిధి గా పాల్గొన్నారు. ఈ కార్యక్రమం లో ఎంపీ మల్లు రవి కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గతం లో రైతులు భూ సమస్యలతో నానా ఇబ్బందులు పడ్డారని కానీ ఇందిరమ్మ రాజ్యం లో రెవెన్యూ అధికారులు ప్రతీ గ్రామాన్ని సందర్శిస్తారని రైతుకు ఒక్క రూపాయి ఖర్చు పెట్టాల్సిన అవసరం లేకుండానే రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన భూ భారతి చట్టం రైతులకు ఎంతో మేలు చేస్తుందన్నారు. 2020 లో గత ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి ద్వారా కేవలం నలుగురు కుటుంబాలు మాత్రమే భాగుపడ్డారని విమర్శించారు. భూములు వున్నా ప్రతి రైతుకు ఈ చట్టం ద్వారా భద్రత కల్పిస్తుందని ఆయన తెలిపారు.

ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి సూచన మేరకు పైలట్ ప్రాజెక్ట్ గా నియోజకవర్గంలోని మండలన్ని తీసుకొని అవగాహన కల్పిస్తున్నామని అదే విధంగా రాష్ట్రంలోని అన్ని జిల్లాల ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. భూమి వున్నా ప్రతి రైతుకు ధైర్యంగా ఈ చట్టం ద్వారా న్యాయం జరుగుతుందని, మే మొదటి వారం నుంచి మిగిలిన 28 జిల్లాలో పైలట్ ప్రాజెక్ట్ గా ప్రతి మండలం లోని గ్రామానికి అధికారులు వచ్చి రైతుల సమస్యలను పరిష్కరిస్తా రన్నారు. రైతుల కోసం అవసరమైతే భూ భారతి చట్టంలో మార్పులు చేయడానికి కూడా సిద్దామని ఆయన మాట్లాడారు. సాధభై నామాలు గతంలో తొమ్మిది లక్షల ఇరవై ఆరు వేల అప్లికేషన్ లు పెండింగ్ లో వున్నాయని, ఈ చట్టం ద్వారా పరిష్కరిస్తున్నామన్నారు. రాష్ట్రం లో ప్రభుత్వ భూములకు, ఫారెస్ట్ భూములకు సర్వే చేయించి రక్షణ కల్పించడం జరుగుతుందన్నారు. పేదవాలకు గతం లో ఇందిరమ్మ రాజ్యం లో సాగు చేస్తున్న భూములకు పట్టాలు ఇచ్చమని కొందరికి సాగు చేస్తున్న పట్టాలు లేని వారికి త్వరలో పట్టాలు ఇస్తామని మంత్రి హామీ ఇచ్చారు. గతం లో ధరణి వల్ల భూమి సాగు కోసం కాకుండా రైతు బంధు కోసం మాత్రమే కొందరికి న్యాయం చేయడానికి ప్రభుత్వం పనిచేసిందని విమర్శించారు. చట్టాలు ప్రభుత్వం చేస్తాయని కానీ కింది స్థాయిలో వాటిని అమలు పరిచేది మాత్రం అధికారులే అని అధికారులు కూడా గ్రామాలలో తిరిగి రైతుల కష్టాలు చూసి వారికి న్యాయం జరిగే విధంగా చూడాలని అధికారులను కోరారు.

ఇందిరమ్మ ప్రభుత్వమంటే పేదవాడి కన్నీళను తీర్చే ప్రభుత్వం. గతం లో పార్టీ లకు సంభందించిన వారికే అధికారులు పని చేశారని ఇప్పుడున్న ప్రభుత్వం పైరవీలకు తావు లేదని ప్రజలకు మేలు చేసేందుకు అధికారులకు పనిచేయాలన్నారు. అధికారులకు అన్ని రకాలుగా ప్రభుత్వం అండగా ఉందని, గత ప్రభుత్వం రాష్ట్ర అప్పు సుమారు 8.19 లక్షల కోట్లు అప్పు చేసి ఈ ప్రభుత్వం మీద భారం వేసిన ఎక్కడ సంక్షేమ పథకాలు ఆగకుండా అన్ని రకాలుగా ప్రభుత్వం పని చేస్తుందని అన్నారు. ఇందిరమ్మ రాజ్యం లో పేద వాడికి సన్న బియ్యం, ఉచిత కరెంట్, 500 రూపాయలు బోనస్, గ్యాస్ సబ్సిడీ లు తో పాటు అనేక సంక్షేమ పథకాలు అందిస్తున్నామన్నారు. అదేవిధంగా ప్రతి నియోజకవర్గం నికి ఇంటిగ్రేటెడ్ స్కూల్ ల నిర్మాణం చెప్పాడుతునమ్మన్నారు. కోటి మంది మహిళలను కోటేశ్వరాలను చేయడానికి ఈ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ సంతోష్ కుమార్, అదనపు కలెక్టర్ లక్ష్మి నారాయణ, డీసీసీబీ చైర్మన్ విష్ణు వర్ధన్ రెడ్డి, మార్కెట్ చైర్మన్ నల్ల హనుమంతు, గ్రంథాలయ చైర్మన్ నీలి శ్రీను తదితరులు పాల్గొన్నారు.