కేటీఆర్, హరీశ్‌లపై మంత్రి పొంగులేటి ఫైర్…

“మి అవినీతి చిట్టా రెడీ..!”..

కేటీఆర్, హరీశ్‌లకు మంత్రి పొంగులేటి స్ట్రాంగ్ వార్నింగ్!

తెలంగాణ రాజకీయాల్లో మరోసారి సెక్రటేరియట్ వేదికగా మాటల యుద్ధం ముదిరింది. మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావులపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇది కేవలం మాటల దాడి కాదు..

ఆరోపణలు..

అవినీతి చిట్టా: “మీ హయాంలో జరిగిన అవినీతి అంతా ప్రభుత్వం దగ్గర చిట్టా రూపంలో ఉంది. త్వరలోనే అన్నీ బయటకు తీస్తాం” అంటూ బాంబు పేల్చారు పొంగులేటి.

తాటాకు చప్పుళ్లు: విపక్షాల విమర్శలకు తాము భయపడే ప్రసక్తే లేదని, ఖబడ్దార్ అంటూ హెచ్చరికలు జారీ చేశారు.

నాదర్‌గుల్ భూముల వివాదం: హరీశ్ రావు తనపై చేస్తున్న ఆరోపణల వెనుక అసలు కారణం నాదర్‌గుల్ భూముల్లో వాటా దక్కకపోవడమేనని సంచలన వ్యాఖ్యలు చేశారు.

వట్టినాగులపల్లి ఇష్యూ: ఈ భూముల వ్యవహారంలో తన కుమారుడికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.

రాష్ట్ర రాజకీయాల్లో ఈ “చిట్టా” వ్యవహారం ఎంత వరకు వెళ్తుందో … లేక గతంలో ఒకసారి ఈ దీపావళికి బిగ్ బ్లాస్ట్ అంటు చివరకు తుస్ అనిపించారు .. త ప్రభుత్వ అవినీతిని బయటపెడుతుందా? వేచి చూడాలి!.