ప్రభుత్వ విద్య బలోపేతమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం అడుగులు… మంత్రి సీతక్క…

ప్రభుత్వ విద్య బలోపేతమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ముందుకు సాగుతోందని, అందులో ఉపాధ్యాయుల పాత్ర అత్యంత కీలకమని రాష్ట్ర మంత్రి సీతక్క స్పష్టం చేశారు. ఉపాధ్యాయుల సంఘం నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ఆమె, ఉపాధ్యాయులందరికీ ఉద్యమాభివందనాలు తెలిపారు. సమాజాన్ని మార్చే శక్తి విద్యకే ఉందని, ఆ విద్యను ప్రజలకు అందించే బాధ్యత టీచర్ల చేతుల్లోనే ఉందని ఆమె పేర్కొన్నారు…మనమంతా ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదువుకుని ఎదిగిన వారమేనని మంత్రి సీతక్క గుర్తు చేశారు. తాను ములుగు గర్ల్స్ హాస్టల్‌లో ఉండి చదువుకున్నానని, ప్రభుత్వ విద్యే తన జీవితానికి దిశానిర్దేశం చేసిందని చెప్పారు. ఉద్యమ కాలంలో సమాజ జ్ఞానాన్ని, శ్రమను గౌరవించడం, ప్రజల కోసం జీవించాలనే సిద్ధాంతాన్ని ఎర్రజెండా నుంచే నేర్చుకున్నానని ఆమె అన్నారు. ఆ విలువలే తనను ఈ స్థాయికి తీసుకొచ్చాయని స్పష్టం చేశారు…ఈ విలువలను మన జీవితాల్లో పాటిస్తూ లక్షలాది మంది విద్యార్థులను.. తీర్చిదిద్దాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని సీతక్క పేర్కొన్నారు. ప్రభుత్వ విద్య బలోపేతం కోసం యుటిఎఫ్ (UTF) సంఘం చేస్తున్న కృషి అభినందనీయమని అన్నారు. ప్రైవేట్ విద్యా సంస్థలకు తీసిపోని విధంగా ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేయాలని, అందుకు ఉపాధ్యాయులే ముందుండాలని పిలుపునిచ్చారు.

గమనిక..
A TO Z వార్తలు ఏదైనా..
మాకు సమాచారం అందించండి.
వాట్సాప్..+91 91330 57959
.