తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సర్పంచి ఎన్నికలు ముగిసిన తర్వాత మళ్లీ మరో ఎన్నికల నగారా మోగనుంది.. మున్సిపాలిటీలు పై ప్రభుత్వం దృష్టి పెడుతున్నట్లుగా సమాచారం.. అందుకు తగినట్లు మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి హుజూర్నగర్ నియోజకవర్గంలోని
మున్సిపాలిటీ, మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికలు జనవరి చివరి వారంలో కాని, ఫిబ్రవరి మొదటి వారంలో కాని నిర్వహించే అవకాశాలు ఉన్నాయి అంటూ నాయకులకు ముందస్తు సంకేతాలు ఇచ్చారు…
హుజూర్ నగర్, నేరేడుచర్ల మున్సిపాలిటీల పరిధిలోని కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు మున్సిపల్ ఎన్నికలకు సిద్ధం కావాలి అంటు మంత్రి ఉత్తమ్ ప్రకటన విడుదల చేశారు..
ఈ శాసనసభ సమావేశాలు ముగియగానే హుజూర్ నగర్, నేరేడుచర్ల మున్సిపాలిటీలలో కార్యకర్తల సమావేశాలు నిర్వహించి మున్సిపల్ ఎన్నికలల్లో అభ్యర్థుల ఎంపిక ప్రచార కార్యక్రమాల పై చర్చ జరుగుతుంది అన్నారు…
గమనిక..
A TO Z వార్తలు ఏదైనా..
మాకు సమాచారం అందించండి.
వాట్సాప్..+91 91330 57959