కాకినాడ నుంచి బియ్యం తరలిపోయేది.. మేము సన్నబియ్యం ఇస్తున్నాం: మంత్రి ఉత్తమ్…

కాకినాడ నుంచి బియ్యం తరలిపోయేది.. మేము సన్నబియ్యం ఇస్తున్నాం: మంత్రి ఉత్తమ్
తెలంగాణ : ఆలేరుకు ఇది చారిత్రాత్మక రోజు అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. శుక్రవారం యాదాద్రి భువనగిరి జిల్లా తిర్మలాపూర్‌లో బహిరంగ సభలో మంత్రి ఉత్తమ్‌ మాట్లాడుతూ.. “గతంలో రేషన్‌ కింద ఇచ్చే బియ్యాన్ని 80 శాతం మంది ప్రజలు తినేవారు కాదు. కాకినాడ నుంచి బియ్యం తరలిపోయేది. మేం సన్నబియ్యం ఇస్తున్నాం. ఒక నియోజకవర్గంలో రూ.వెయ్యి కోట్లకు పైగా అభివృద్ధి పనులు జరుగుతున్నాయి.” అని పేర్కొన్నారు..