రాష్ట్రంలో కొత్తగా అర్హులైన వారికి రేషన్ కార్డులు మంజూరు చేసి సన్న బియ్యం ఇవ్వబోతున్నము… మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి..
*సూర్యాపేట జిల్లా…
జాన్ పహాడ్ సైదులు బాబా దర్గా ఉర్సు ఏర్పాట్లను పరిశీలించడానికి రాష్ట్ర పౌరసరఫరాల నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి విచ్చేశారు.
*వక్ఫ్ బోర్డు చైర్మన్ సయ్యద్ అజ్మతుల్లా హుస్సేని తో కలసి దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
*ఈనెల 23,24,25 తారీకుల్లో జరగనున్న ఉర్సు ఉత్సవాల ఏర్పాట్లను పరిశీలించారు.
*మంత్రి ఉత్తమ్ మాట్లడుతూ..

*సర్వమత సమ్మేళనానికి ప్రతీకగా నిలిచిన జాన్ పహాడ్ దర్గా అంటే ప్రత్యేక అభిమానం .
*హిందువులు,ముస్లిం లతో పాటు ఇక్కడికి వచ్చే లక్షలాదిగా వచ్చే భక్తులకు
..ఉర్సు ఉత్సవాలలో ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా నిర్వహించాలి.
*400 ఏళ్ల నాటి జాన్పహాడ్ దర్గా ప్రాశస్త్యం కాపాడేందుకుగాను మూడుసార్లు శాసనసభ్యుడిగా ఉమ్మడి రాష్ట్రంలో మరియు తెలంగాణ రాష్ట్రంలో మంత్రిగా అవిరళ కృషి చేశాను.
*గతంలో ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా ఉన్నప్పుడు 60 లక్షల రూపాయలు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర మంత్రిగా ఈ ప్రాంత ఎమ్మెల్యేగా దర్గా అభివృద్ధి కోసం కోటి 11 లక్షల రూపాయలను మంజూరు చేశా.
*జాన్ పహాడ్ నుండి ప్రత్యేకంగా రైలు మార్గాన్ని కూడా ఏర్పాటు చేశా.
*వెనుకపడ్డ పాలకీడు మండలానికి ఎన్నో అభివృద్ధి పనులు నిర్వహించాము.
*జాన్ పహాడ్ వద్ద కొత్తగా నిర్మిస్తున్న ఎత్తి పోతల పథకానికి భూమి పరిశీలన పూర్తి అయింది.
*నూతనంగా ఏర్పాటు చేయబోయే లిఫ్ట్ కు జవహర్ లాల్ నెహ్రూ నామకరణం చేస్తున్న.
*ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనలో
రాష్ట్రంలో కొత్తగా అర్హులైన వారికి రేషన్ కార్డులు మంజూరు చేసి సన్న బియ్యం ఇవ్వబోతున్నము.
*పదేళ్ల brs పాలనలో విస్మరించిన ఈ పథకానికి 40 లక్షల మందికి పైగా కొత్తగా రేషన్ కార్డులు ఇవ్వబోతున్నాము.
*అర్హత ఉండి రేషన్ కార్డు పొందలేని వారు మళ్ళీ గ్రామ సభల్లో దరఖాస్తు చేసుకోవాలి.
*ఈ పథకం పై ప్రతి పక్షాలు తప్పుడు ప్రచారాలు మానుకోవాలి.
*రాష్ట్రంలో అర్హత వున్న చివరి వ్యక్తి వరకు రేషన్ కార్డులు అందిచేంత వరకు ఈ ప్రక్రియ కొనసుగుతుంది.
*రేషన్ కార్డు ప్రక్రియ పూర్తి అయిన తర్వాత అందరికీ మంచి క్వాలిటీ సన్న బియ్యం అందిస్తాము.