పెళ్లి కొడుకు మెడలో నుంచి నోట్ల దండను దొంగలించిన దొంగ..గుర్రం దిగిన పెళ్లి కొడుకు బైక్‌పై సినిమా రేంజ్లో చేజ్..!
పెళ్లి కొడుకు మెడలో నుంచి నోట్ల దండను దొంగలించిన దొంగ.. సినిమా రేంజ్‌ను తలపించేలా చేజ్ చేసి దొంగను పట్టుకున్న పెళ్ళికొడుకు
మీరట్‌లో ఓ పెళ్లి కొడుకు మేడలో నోట్ల దండతో గుర్రంపై ఉరేగుతుంటే.. ఒక దొంగ టాటా ఏస్‌లో వచ్చి నోట్ల దండను దొంగిలించాడు.
దీంతో గుర్రం దిగిన పెళ్లి కొడుకు బైక్‌పై సినిమా రేంజ్లో చేజ్ చేసి.. దొంగను పట్టుకొని చితక్కొట్టాడు…
మెడలో వేసుకున్న డబ్బుల దండ నుంచి నోట్లు దొంగిలించి పారిపోతున్న వ్యక్తిని ఓ పెళ్లికొడుకు సినీ ఫక్కీలో ఛేజ్ చేసి పట్టుకున్నాడు. ఈ సంఘటన ఉత్తర్‌ప్రదేశ్ జరిగింది. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మేరఠ్‌లోని డుంగ్రావలీ గ్రామానికి చెందిన ఓ యువకుడు పెళ్లి జరుగుతుంది. అందులో భాగంగా సంప్రదాయంగా పెళ్లి కొడుకును గుర్రంపై ఊరేగిస్తున్నారు. అదే సమయంలో ఓ మినీ ట్రక్కును నడుపుతున్న డ్రైవర్ బండిని వరుడి దగ్గరకు తీసుకెళ్లాడు. ట్రక్కు కిటికీ నుంచి బయటకు చేయి పెట్టి పెళ్లి కొడుకు మెడలోని నోట్ల దండను లాగి తెంచేశాడు. చేతికందిన నోట్లను తీసుకుని వాహనం వేగం పెంచాడు. కోపంతో ఊగిపోయిన పెళ్లి కొడుకు వెంటనే గుర్రం దిగి ఓ బైకుపై వాహనాన్ని వెంబడించాడు. ఆ మినీ ట్రక్కు ప్రయాణిస్తుండగానే దానిపైకి దూకి కిటికీ నుంచి లోపలికి వెళ్లి బండిని ఆపాడు. డ్రైవర్‌ను కిందకి దింపి స్థానికులతో కలిసి చితకబాదాడు… ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..