మోహన్ బాబు ఏ టెస్ట్‌లు చేయించుకొని రాజ్యసభ సభ్యుడు అయ్యాడు?
మంచు విష్ణు వ్యాఖ్యలకు కాంగ్రెస్ జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి కౌంటర్
మోహన్ బాబు కూడా రాజ్యసభ సభ్యుడిగా ఉన్నాడు, ఆయన ఏ పరీక్షలు చేయించుకున్నాడు?
మీ సోదరుడు మనోజ్ టెస్ట్‌లే మీరు చేయించలేరు, మాపై ఆరోపణలు చేయడం ఏంటి?
నేను ఒక ఎమ్మెల్యేగా డ్రగ్స్ టెస్ట్ చేయించుకుని రిపోర్టులు చూపిస్తాను, మీరు కూడా అదే విధంగా చేయాలి
మేము ఏం టెస్ట్‌లు చేయించుకోవాలి రాసివ్వు, అన్ని చేయించుకుని మీ ముందు రిపోర్టులు ఉంచుతాము, కానీ మీరు కూడా ఇందుకు సిద్ధంగా ఉండాలి – జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి..
మంచు విష్ణు కౌంటర్..
ఎమ్మెల్యే వ్యాఖ్యలు నేరుగా ఇండస్ట్రీని టార్గెట్ చేసినట్లు ఉండటంతో, మంచు విష్ణు సోషల్ మీడియా వేదికగా ఘాటుగానే స్పందించారు. కేవలం సినిమా రంగాన్నే ఎందుకు వేలెత్తి చూపిస్తున్నారని ప్రశ్నిస్తూ.. రాజకీయ నాయకులకు కూడా ఒక సవాల్ విసిరారు.
“సినిమా విడుదలకు ముందు మేము డ్రగ్ టెస్టులు చేయించుకోవడానికి సిద్ధమే. కానీ, అదే తర్కంతో ఆలోచిస్తే.. ఎన్నికల్లో పోటీ చేసే ప్రజాప్రతినిధులు కూడా ఎలాంటి టెస్టులు చేయించుకోవాలో ఎమ్మెల్యే గారు చెప్తారా?” అని ప్రశ్నించారు.ప్రజలను పాలించే ఎమ్మెల్యేలు, సమాజంలో అత్యంత బాధ్యతాయుతమైన పదవుల్లో ఉండేవారు కూడా పారదర్శకంగా ఉండాలని, కేవలం గ్లామర్ ఫీల్డ్‌ను లక్ష్యంగా చేసుకోవడం సరికాదని విష్ణు హితవు పలికారు.
నెట్టింట వైరల్ అవుతున్న కౌంటర్
కొంతకాలంగా టాలీవుడ్‌ను డ్రగ్స్ వ్యవహారం నీడలా వెంటాడుతున్న తరుణంలో, ఒక ఎమ్మెల్యే నేరుగా సినిమా రిలీజ్‌తో దీనిని ముడిపెట్టడం చర్చనీయాంశమైంది. దీనికి మంచు విష్ణు ఇచ్చిన కౌంటర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తప్పు ఎక్కడ ఉన్నా ప్రశ్నించాలి.. కానీ ఒకే రంగాన్ని బలిపశువును చేయడం కరెక్ట్ కాదు అంటూ నెటిజన్లు కూడా విష్ణు వ్యాఖ్యలకు మద్దతు తెలుపుతున్నారు. రాజకీయ వర్గాల నుంచి ఈ కౌంటర్‌పై ఎలాంటి రియాక్షన్ వస్తుందో చూడాలి. ఏది ఏమైనా, ప్రస్తుతం టాలీవుడ్ వర్సెస్ పొలిటికల్ వార్ మాత్రం పీక్స్‌కు చేరింది..
అనిరుధ్ రెడ్డి వ్యాఖ్యలు దుమారం.. రాహుల్ రామకృష్ణ కౌంటర్ వైరల్.
జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం పెద్ద చర్చకు దారి తీశాయి. సినిమా ఇండస్ట్రీలో మాదక ద్రవ్యాల వినియోగం పెరిగిందంటూ ఆయన చేసిన ఆరోపణలు రాజకీయాలు, సినీ రంగాల మధ్య వాగ్వాదానికి కారణమయ్యాయి. ఈ వివాదానికి కారణమైన అంశం ఏమిటంటే, నటీనటులందరికీ డ్రగ్ టెస్టులు తప్పనిసరి చేయాలని అనిరుధ్ రెడ్డి చేసిన డిమాండ్. ప్రతి 90 రోజులకు ఒకసారి నటీనటులు డ్రగ్స్ టెస్టులు చేయించుకోవాలని, ఆ పరీక్షల్లో నెగటివ్ రిపోర్ట్ వస్తేనే వారి సినిమాలకు రిలీజ్ అనుమతి ఇవ్వాలని ఆయన సూచించారు. ఈ విధానాన్ని ప్రభుత్వం అమలు చేయాలని కూడా కోరారు..అలాగే ప్రజలు రాజకీయ నాయకుల కంటే హీరోలు, నటీనటుల మాటలను ఎక్కువగా వింటారని, వారు డ్రగ్స్ తీసుకుంటున్నారని తెలిసితే అభిమానులు కూడా వారిని దూరంగా పెడతారని ఆయన వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విస్తృత చర్చకు దారి తీశాయి.ఇదిలా ఉండగా, ఈ వ్యాఖ్యలపై సినీ నటుడు రాహుల్ రామకృష్ణ ఆసక్తికరంగా స్పందించారు. తాను హీరో కాకపోయినా డ్రగ్ టెస్టులకు సిద్ధమేనని పేర్కొంటూ, వెంటనే ప్రభుత్వం జీవో జారీ చేస్తే అందరం కలిసి టెస్టులు చేయించుకుందామని అన్నారు. అయితే అదే సమయంలో రాజకీయ నాయకులపై కూడా ప్రశ్నలు లేవనెత్తారు.
‘‘మేము డ్రగ్ టెస్టులు చేస్తే, మీరు లై డిటెక్టర్ టెస్టులు చేయించుకుంటారా?’’ అని ఆయన ప్రశ్నించారు. ప్రతి ఆదివారం నటీనటులు డ్రగ్ టెస్టులు, రాజకీయ నాయకులు లై డిటెక్టర్ టెస్టులు చేయించుకుంటే ప్రజలకు నిజాలు తెలుస్తాయని వ్యాఖ్యానించారు. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియా వేదికగా పంచుకోవడంతో అది వైరల్‌గా మారింది. మరోవైపు నటుడు, మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (MAA) అధ్యక్షుడు మంచు విష్ణు కూడా స్పందిస్తూ, ఎన్నికల్లో నామినేషన్ వేయడానికి ముందు రాజకీయ నాయకులు ఎలాంటి టెస్టులు చేయించుకోవాలి అని ప్రశ్నించారు. దీంతో ఈ వివాదం మరింత వేడెక్కింది.ప్రస్తుతం ఈ వ్యవహారం రాజకీయాలు vs సినిమా ఇండస్ట్రీగా మారింది. ఒకవైపు డ్రగ్స్ నియంత్రణ పేరుతో కఠిన చర్యలు తీసుకోవాలని రాజకీయ వర్గాలు చెబుతుంటే, మరోవైపు సినీ ప్రముఖులు ఒకే రంగాన్ని లక్ష్యంగా చేసుకోవడం సరైంది కాదని అంటున్నారు..