ఇరాన్ యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలకవ్యాఖ్యలు చేశారు. యుద్ధాన్ని ఇప్పట్లో ఆపే పరిస్థితి లేదన్నారు. పరేషన్ ఎపిక్ ఫ్యూరీ కొనసాగుతుందిని స్పష్టం చేశారు. 2-3 వారాల్లో మరిన్ని భీకరదాడులు చేయబోతున్నట్టు చెప్పుకొచ్చారు. వైట్ హైస్ జాతిని ఉద్దేశిస్తూ ప్రసంగిచిన ఆయన ఈసందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ.. ఇరాన్ నేతలను అంతం చేశామని, ఇరాన్ ఎర్‌ఫోర్స్, నేవిలను నిర్వీర్యం చేశామన్నారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నందునే ఇరాన్‌పై యుద్ధం ప్రకటించామన్నారు. అమెరికా భద్రత కోసమే ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ చేపట్టినట్టు చెప్పుకొచ్చారు..మా లక్ష్యాలను పూర్తిస్థాయిలో చేరుకునేదాకా ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ కొనసాగుతుందని నేను మొదటినుంచి చెబుతూనే ఉన్నానన్నారు. ఇందులో ఇప్పటిదాకా పురోగతి కనిపించిందని.. అమెరికా సైనిక లక్ష్యాలు చేరుకోవడంలో మేం సరైన దిశలోనే వెళుతున్నామన్నారు. ఇరాన్‌ను మళ్లీ వారి రాతియుగంలోకి తీసుకెళతామన్నారు.అదేసమయంలో ఇరాన్‌తో చర్చలు కొనసాగుతున్నాయని.. ఇరాన్ నాయకత్వ మార్పిడి తమ లక్ష్యం కాదని.. కానీ ఇరాన్‌లోని నాయకులు చనిపోవడం వల్లే నాయకత్వ మార్పిడి జరిగిందన్నారు…అయిల్ కోసం పశ్చిమాసియాపై ఎప్పుడూ ఆదారపడకూడదన్నారు. గత అధ్యక్షుడు చేసిన తప్పుల్ని తాను సరిచేస్తున్నానన్నాడు. తాను ఐదేళ్ల పాలనలో ఎన్నో విజయాలు సాధించానని.. అమెరికాను ప్రపంచంలోనే శక్తి వంతమైన దేశాంగా మార్చామన్నారు. అమెరికా ఆర్థికవ్యవస్థ పటిష్ఠంగా ఉందని.. అమెరికాలో ఇంధన సమస్య తాత్కాలికమేనన్నారు. తమకు హర్మూజ్ జలసంధి అవసరం లేదని.. అమెరికాలో పుష్కలంగా చమురు నిక్షేపాలు ఉన్నాయన్నారు…
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.