కష్టపడి ఈ స్థాయికి వచ్చాను, ఒక్క పోటుతో కూల్చేశారు..చిన్నారెడ్డి..

అధిష్ఠానం నిర్ణయంపై స్పందించిన చిన్నారెడ్డి..

నాకు పదవులపై సోకు లేదు..

కష్టపడి ఈ స్థాయికి వచ్చాను, ఒక్క పోటుతో కూల్చేశారు..

ఇందిరాగాంధీ పార్టీ పెట్టినప్పటి నుండి కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాను..

ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ పదవి కూడా “టిల్ ఫర్థర్ ఆర్డర్” అని ఇచ్చారు..

పదవులు లేకున్నా నా గౌరవం నాకు ఉంటుంది, పదవి కోసం రేవంత్ రెడ్డిని కలిసే ప్రయత్నం కూడా చేయలేదు..

నా మనుషులు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసుకు వెళ్తే మెడ పట్టి బయటకు దొబ్బుతానని మేఘా రెడ్డి అన్నాడు.. అయినా భరించా.– ప్లానింగ్ కమిషన్ మాజీ వైస్ చైర్మన్ చిన్నారెడ్డి.

వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డిపై మాజీ మంత్రి , ప్లానింగ్‌ కమిషన్ వైస్‌ చైర్మన్‌ చిన్నారెడ్డి ( Chinna Reddy) చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ అధిష్టానం ( Congress High Command ) చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగా చిన్నారెడ్డిని పదవి నుంచి తొలగించాలని అధిష్టానం రాష్ట్ర ప్రభుత్వానికి సూచిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా అధిష్టానం నిర్ణయంపై చిన్నారెడ్డి తొలిసారి స్పందించారు..తనకు పదవులపై సోకు లేదని స్పష్టం చేశారు. కష్టపడి ఈ స్థాయికి వచ్చాను. ఒక్క పోటుతో కూల్చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ పదవి కూడా “టిల్ ఫర్థర్ ఆర్డర్” అని ఇచ్చారని తెలిపారు. ఇందిరాగాంధీ పార్టీ పెట్టినప్పటి నుండి కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నానని పేర్కొన్నారు. పదవులు లేకున్నా గౌరవం నాకు ఉంటుంది. పదవి కోసం రేవంత్ రెడ్డిని కలిసే ప్రయత్నం కూడా చేయలేదని అన్నారు. తన మనుషులు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసుకు వెళ్తే మెడ పట్టి బయటకు దొబ్బుతానని మేఘా రెడ్డి హెచ్చరించినా భరించానని వెల్లడించారు…