దెందులూరు నియోజకవర్గంలో జనసేన, టిడిపి శ్రేణుల మధ్య ఘర్షణలు చిలికి చిలికి గాలి వానగా మారుతున్నాయి. తాజాగా పైడిచింతలపాడు గ్రామంలో టిడిపి, జనసేన వర్గాల మధ్య చోటు చేసుకున్న ఘర్షణ పైన ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఘాటుగా స్పందించారు. ఘర్షణకు పాల్పడిన వారికి ఆయన స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. టీడీపీ, జనసేన పార్టీ నేతల మధ్య విభేదాలపై MLA చింతమనేని ప్రభాకర్ స్పందించారు. శుక్రవారం ఓ మీడియా ఛానల్ ప్రతినిధితో ఆయన మాట్లాడారు..కొన్ని అరాచక శక్తులు ఇటీవలే జనసేనలో చేరాయని కీలక ఆరోపణలు చేరారు. రాజకీయ పబ్బం గడుపుకోవడానికే వాళ్లు పార్టీలో చేరారని ఆరోపించారు. చేరినవాళ్లు చేరినట్టు ఉంటే మంచిది. పెన్షన్ల పంపిణీతో వాళ్లకు సంబంధమేంటి? అని ప్రశ్నించారు. గ్రామాల్లో గొడవలు పెట్టే సంస్కృతి మానుకోవాలని స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. ఆ రోజు కూటమి ఓటమికి ప్రయత్నించింది కూడా వారే అని అన్నారు. ఇప్పుడు పార్టీలో చేరి అధికారం చెలాయిస్తామంటే కుదరదు….
గతంలో కూటమి ఓటమికి ప్రయత్నించిన వాళ్లే
కొంతమంది ఆధిపత్యం కోసం ఘర్షణలకు దిగుతున్నారని మండిపడ్డారు. కొన్ని అరాచక శక్తులు ఇటీవల జనసేన పార్టీలో చేరాయని, కేవలం పబ్బం గడుపుకోడానికే వారు జనసేన పార్టీలో చేరినట్టు ఉందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. గతంలో కూటమి ఓటమికి ప్రయత్నించిన వాళ్లే ఇప్పుడు జనసేన పార్టీలో చేరారని అన్నారు.