తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా మహాశివరాత్రి వేడుకలు..!

మహాశివరాత్రి నేపథ్యంలో తెలుగురాష్ట్రాల్లోని శైవక్షేత్రాలు శివనామస్మరణలతో మార్మోగుతున్నాయి. స్వామివారిని దర్శించుకునేందుకు వేకువ జామునుంచే భక్తులు ఆలయాలకు తరలివస్తున్నారు. శ్రీకాళహస్తి, శ్రీశైలం, వేములవాడ, కీసర తదితర ఆలయాలకు భక్తులు భారీగా తరలివచ్చారు. ..

ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటిగా ప్రఖ్యాతి గాంచిన శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. మహాశివరాత్రి సందర్భంగా స్వామి వారి దర్శనం కోసం శ్రీశైల క్షేత్రానికి భారీగా తరలివస్తున్నారు భక్తులు. భక్తులకు మరిన్ని సౌకర్యాలు ఉన్నాయి, శ్రీశైలం దేవస్థానం ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు.

మహా శివరాత్రి శివ భక్తులకు ముఖ్యమైన పర్వదినం. దేశ వ్యాప్తంగా ఉన్న శివాలయాల్లో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నారు. అత్యంత సుందరంగా ఆలయాలను అలంకరిస్తారు. జాగరణ, ఉపవాసం, పూజలను నిర్వహిస్తారు.

ఆలయంలో రాత్రంతా దీపం వెలిగించి జాగారం చేయడం ఒక సాధారణ ఆచారం. ఈ మహాశివరాత్రి పర్వదినం రోజున శివయ్య ఆశీర్వాదం కోసం ప్రముఖ శైవ క్షేత్రాలను దర్శనం చేసుకోవాలనుకుంటున్నారు..