ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసుపై విచారణ వాయిదా..
ఏప్రిల్ 2కు వాయిదా వేసిన సుప్రీంకోర్టు..
పిటిషనర్ల తరపు వాదనలు పూర్తి..
కౌశిక్రెడ్డి తరపున వాదనలు వినిపించిన లాయర్ సుందరం..
కేటీఆర్ తరపున వాదనలు వినిపించిన శేషాద్రినాయుడు
తదుపరి విచారణలో ప్రతివాదుల వాదనలు వినే అవకాశం…
సుప్రీంకోర్టులో పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు విచారణ ప్రారంభం
బీఆర్ఎస్ తరఫున వాదనలు వినిపిస్తున్న ఆర్యమా సుందరం
పార్టీ ఫిరాయింపుల పై మొదట 18 మార్చి 2024 లో స్పీకర్ కు పిర్యాదు చేశాం
మొదట పిర్యాదు చేశాక కనీసం నోటీసులు కూడా ఇవ్వలేదు
పార్టీ మారిన వాళ్ళు కాంగ్రెస్ కోసం లోక్ సభ ఎన్నికల్లో ప్రచారం చేశారు
బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యేగా గెలిచిన దానం నాగేందర్.. లోక్ సభ ఎన్నికల్లో ఎంపీగా కాంగ్రెస్ పార్టీలో పోటీ చేశారు
కాంగ్రెస్ పార్టీ నుంచి లోక్ సభకు పోటీ చేసి ఎంపీగా ఒడి పోయి.. ఇపుడు ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు…
*గత తీర్పులు స్పష్టంగా లేనప్పుడు ఎలా ముందుకెళ్లగలం: సుప్రీంకోర్టు*
పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై విచారణకు నాలుగు వారాల్లో షెడ్యూల్ ఖరారు చేయాలని సింగిల్ జడ్జి తీర్పు ఇచ్చినా ఎలాం టి చర్యలు తీసుకోలేదని సుప్రీంకోర్టు దృష్టికి బీఆర్ఎస్ తరపున న్యాయవాదులు తెలిపారు.
బీఆర్ఎస్లో గెలిచి కాంగ్రెస్ లో చేరిన పది మంది ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలనే ఆదేశించా లని కోరుతూ సుప్రీంకోర్టులో బీఆర్ఎస్ దాఖలు చేసిన పిటిషన్లపై ఉన్నత న్యాయ స్థానం ఈరోజు విచారిం చింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, బీఆర్ ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి దాఖలు చేసిన రెండు వేర్వేరు పిటిషన్లను కలిపి సుప్రీంకోర్టు విచారించింది.
బీఆర్ఎస్ ఎమ్మెల్యేల తరపున సుందరం, శేషాద్రి నాయుడు కోర్టులో వాదనలు వినిపించారు. పార్టీ మారిన ఫిరాయించిన ముగ్గురు ఎమ్మెల్యేలపై వేర్వేరుగా ఫిర్యాదు చేసినా స్పీకర్ స్పందించలేదని ఉన్నత న్యాయస్థానం దృష్టికి తెచ్చారు.
పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యే ఒకరు కాంగ్రెస్ తరపున ఎంపీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారని కోర్టుకు తెలిపారు. ఎంపీ ఎన్నికల్లో ఓడిపోయినా అతను ఇంకా ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారని బీఆర్ఎస్ న్యాయవాది తెలిపారు. ఈ విషయాలపై తెలంగాణ హైకోర్టులో కూడా పిటిషన్ దాఖలు చేసినట్టు న్యాయవాది గుర్తు చేశారు.
నాలుగు వారాల్లో షెడ్యూల్ ఖరారు చేయాలని సింగిల్ జడ్జి తీర్పు ఇచ్చిన విష యాన్ని న్యాయవాదులు కోర్టులో ప్రస్తావించారు. తగిన సమయం అంటే ఎమ్మెల్యేల పదవీకాలం ముగిసేవరకా అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఫిర్యాదు వచ్చి ఎన్ని రోజులు అవుతుందని ఉన్నత న్యాయస్థానం అడిగింది.నాలుగు వారాలైనా షెడ్యూల్ ఫిక్స్ చేయలేదా?అని కోర్టు అడిగింది.
పార్టీ ఫిరాయించిన ఎమ్మె ల్యేలకు స్పీకర్ నోటీసులు ఇవ్వలేదని తెలిపారు ధర్మాసనం వ్యాఖ్యలను చేసిన తర్వాతే నోటీసు లిచ్చిన విషయాన్ని బీఆర్ ఎస్ తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తెచ్చారు. మూడు వారాల్లో సమాధానం ఇవ్వాలని నోటీసులు ఇచ్చారు.. కానీ, నోటీసులు ఎటు వెళ్లాయో తెలియదని కౌశిక్ రెడ్డి తరపు న్యాయవాది తెలిపారు.
తాము ఫిర్యాదు చేసి ఏడాదైనా స్పీకర్ ఇంకా షెడ్యూల్ చేయలేదన్నారు. ఈ సమయంలో సుప్రీంకోర్టు జడ్జి గవాయ్ స్పందించారు. పార్టీ ఫిరాయింపులకు వార్షికోత్సవం అయిందా అని వ్యాఖ్యానించారు. అదే సమయంలో పార్టీ ఫిరాయింపు విషయంలో ఎప్పటిలాగా తేల్చాలనే దానిపై గత తీర్పులు స్పష్టంగా చెప్పలేదని.. అలాంటప్పుడు ఆ తీర్పులను కాదని ఎలా ముందుకు వెళ్లగలమని సుప్రీంకోర్టు ప్రశ్నించింది.