ఇందిరమ్మ రాజ్యం ఎమర్జెన్సీ పాలనను తలపిస్తోంది..mlc కవిత…

బీఆర్ఎస్(BRS) ఎమ్మెల్యేలు హరీష్ రావు(Harish Rao), పాడి కౌశిక్ రెడ్డి(Kaushik Reddy)లను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే..బుధవారం పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని పలు సెక్షన్ల కింద కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. గురువారం ఉదయం అరెస్ట్ చేసేందుకు వెళ్లారు. ఆ సమయంలో కౌశిక్‌ రెడ్డికి మద్దతు ఇచ్చేందుకు వచ్చిన హరీష్ రావును సైతం అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఇద్దరూ గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌లో ఉన్నారు.
తాజాగా.. హరీష్ రావు, కౌశిక్ రెడ్డిని కలిసేందుకు ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha) పోలీస్ స్టేషన్‌కు వచ్చారు. ఆమెతో పాటు భారీ సంఖ్యలో బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు అక్కడకు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. ప్రస్తుతం గచ్చిబౌలి పీఎస్ ఎదుట బీఆర్ఎస్ నేతలు ఆందోళన చేస్తున్నారు. హరీష్ రావు, కౌశిక్ రెడ్డిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు….

ఇందిరమ్మ రాజ్యం ఎమర్జెన్సీ పాలనను తలపిస్తోందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. ఇవాళ బీఆర్ఎస్ నేతలు హరీశ్ రావు, పాడి కౌశిక్ రెడ్డి అరెస్టుల నేపథ్యంలోనే గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ కి ఎమ్మెల్సీ కవిత వెళ్లి హరీశ్ రావు, ఇతర బీఆర్ఎస్ నేతలను పరామర్శించారు. అనంతరం ఆమె మీడియా తో మాట్లాడుతూ.. ఇది ఇందిరమ్మ రాజ్యం కాదని, పోలీసు రాజ్యం నడుస్తోందన్నారు. బీఆర్ఎస్ నేతలపై అక్రమ కేసులు పెట్టడం అన్యాయమన్నారు.