స్పీకర్‌ను కించపరిచేలా నేను మాట్లాడలేదు.. అలాంటి కుసంస్కారం నాకు లేదు ..ఎమ్మెల్సీ తాతా మధు

స్పీకర్‌ను కించపరిచేలా నేను మాట్లాడలేదు.. అలాంటి కుసంస్కారం నాకు లేదని ఎమ్మెల్సీ తాతా మధు అన్నారు. అసెంబ్లీకి వెళ్తుంటే తమపై జరిగిన పోలీసుల దౌర్జన్యం గురించి ఎమ్మెల్సీ తాతా మధు మాట్లాడుతూ.. నన్ను బర్తరఫ్‌ చేయాలా, సస్పెండ్ చేయాలా, అరెస్ట్‌ చేయాలా అనేది వారి విజ్ఞతకే వదిలేస్తున్నా. ఎమ్మెల్సీ పదవి కోసం నేనే బాధపడడం లేదు. కాంగ్రెస్ డైవర్షన్‌ పాలిటిక్స్ చేస్తోందని ఆరోపించారు. బీఆర్‌ఎస్ ప్రజా ప్రతినిధులపై జరిగిన దాడిని కప్పిపుచ్చేందుకే నాపై ఆరోపణలు చేస్తున్నారు. మీకు దమ్ముంటే ప్రజా సమస్యల మీద మాట్లాడండి.. తాతా మధు అనని మాటలను డైవర్ట్‌ పాలిటిక్స్ కోసం వాడుతున్నారని మండిపడ్డారు.