రోజంతా ఫోన్ వాడి రాత్రంతా ఛార్జింగ్ పెట్టడం చాలా మందికి అలవాటు. ఉదయానికి 100 శాతం ఛార్జింగ్ కనిపించేసరికి హ్యాపీగా ఫీలవుతుంటారు. కానీ, రాత్రంతా ఫోన్ ఛార్జింగ్లో పెట్టడం వల్ల బ్యాటరీ సామర్థ్యం దెబ్బతినే అవకాశం ఉంది. నిజానికి, ఇప్పటి ఫోన్లు చాలా స్మార్ట్. బ్యాటరీ 100 శాతం నిండగానే ఛార్జింగ్ను వాటంతట అవే ఆపేస్తాయి. కానీ, అసలు సమస్య 100 శాతం వద్ద ఎక్కువ సేపు ఉండటం. దీనివల్ల లిథియం అయాన్ బ్యాటరీలపై ఓల్టేజ్ స్ట్రెస్ పెరిగి కాలక్రమేణా సామర్థ్యం తగ్గుతుంది..
గమనిక.. మీ ప్రాంతాల్లో A TO Z వార్తలు ఏదైనా..మాకు సమాచారం అందించండి.
వాట్సాప్..+91 91330 57959.