ఏపీలో నరేంద్ర మోడీ తల్లి పేరిట ఆలయం
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం గుండికల్ గ్రామంలో మోడీ తల్లి హీరాబెన్ మోడీ పేరిట ఆలయం నిర్మించేందుకు భూమి పూజ చేసిన మతాశ్రీ మందిరం చారిటబుల్ ట్రస్టు సొసైటీ
ముఖ్య అతిధులుగా హాజరైన బీజేపీ, జనసేన, వైసీపీ నాయకులు..
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తల్లి హీరాబెన్ మోదీ పేరిట కర్నూలు జిల్లాలో ఆలయ నిర్మాణం చేపట్టనున్నారు. ఎమ్మిగనూరు మండలంలోని గుడికల్ గ్రామంలో… మాతా శ్రీ మందిరం చారిటబుల్ సొసైటీ ఆధ్వర్యంలో శివుడు, దక్షిణమూర్తి, రాముడు, వినాయక ఆలయాలు, అనాథ శరణాలయం, గోశాలతో పాటు ప్రధాని మోదీ తల్లి పేరిట ఆలయ నిర్మాణానికి ఆదివారం భూమి పూజ నిర్వహించారు…
ముఖ్య అతిథులుగా ఆదోని బీజేపీ ఎమ్మెల్యే పార్థసారధి, వైసీపీ నాయకుడు రుద్రగౌడ్, మాజీ సర్పంచ్ పంపన్న గౌడ్, బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షుడు కునిగిరి నీలకంఠ, జనసేన సమన్వయకర్త చల్లా వరుణ్ పాల్గొన్నారు. కార్యక్రమంలో మాతా శ్రీ మందిరం చారిటబుల్ సొసైటీ ప్రెసిడెంట్ శివకుమార్, వైస్ ప్రెసిడెంట్ యూనస్, ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు…