త్రైపాక్షిక సమావేశం గురించి అడిగినప్పుడు, చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మావో నింగ్ ఈ శిఖరాగ్ర సమావేశం ‘చారిత్రాత్మక ప్రాముఖ్యత’ కలిగి ఉంటుందని అన్నారు. ప్రపంచ స్థిరత్వం కోసం చైనా, అమెరికా, రష్యాలు పరస్పరం సహకరించుకోవాలని ఆమె నొక్కి చెప్పారు… షీ జిన్‌పింగ్, వ్లాదిమిర్ పుతిన్ మరియు డొనాల్డ్ ట్రంప్‌ల మధ్య జరగనున్న త్రైపాక్షిక సమావేశాన్ని చైనా సోమవారం ‘చారిత్రాత్మక ప్రాముఖ్యత’ కలిగినదిగా అభివర్ణించింది. ప్రపంచ శాంతి పరిరక్షణపై ఈ ముగ్గురు నాయకులు చర్చలు జరుపుతారని, ఇరాన్ యుద్ధం మరియు ఉక్రెయిన్ వివాదంపై కూడా చర్చలు జరగవచ్చని సూచించింది..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోమవారం రోజు కీలక ప్రకటన చేశారు. ఆసియా పసిఫిక్ ఎకనామిక్ కోఆపరేషన్ (APEC) సదస్సు కోసం ట్రంప్ చైనాకు వెళ్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా తాను చైనాలో ఉండే సమయంలో ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్‌తో సమావేశం అయ్యే అవకాశం ఉందని ట్రంప్ వెల్లడించారు. ఉత్తర కొరియా అణ్వాయుధ కార్యక్రమంపై నిలిచిపోయిన చర్చలను మళ్లీ పట్టాలెక్కించడానికి అమెరికా ప్రయత్నిస్తున్న తరుణంలో ట్రంప్ తాజాగా చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి…ఆగస్టులో దక్షిణా కొరియాతో సంయుక్త సైనిక విన్యాసాలను తగ్గించాలని పెంటగాన్‌ను ఆదేశించిన ట్రంప్, ఈ పర్యటనలో ఆయనను కలుస్తారా? లేదా అన్నది అత్యంత ఆసక్తికరంగా మారింది. ట్రంప్ ఆసియా పర్యటన ముందుగా ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలో ప్రారంభం కానుంది. ఆ తర్వాత అపెక్ సదస్సు కోసం చైనా టెక్ హబ్ సిటీ షెన్జెన్కు చేరుకుంటారు. ఈ పర్యటనలో ట్రంప్ ప్రధానంగా ఆర్థిక ఒప్పందాలతో పాటు, రష్యా, చైనాతో జరగనున్న చారిత్రాత్మక అణు చర్చలపై దృష్టి సారించనున్నారు…ముగ్గురు నాయకుల మధ్య జరగనున్న మొట్టమొదటి ముఖాముఖి త్రైపాక్షిక సమావేశంపై విలేకరులకు వివరణ ఇస్తూ , చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మావో నింగ్, రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో బీజింగ్, వాషింగ్టన్ మరియు మాస్కోలు ఒకరికొకరు తోడుగా ఎలా పోరాడాయో గుర్తు చేశారు. అలాగే, ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించేందుకు వారు ఇప్పటికీ ముఖ్యమైన బాధ్యతలను మోస్తున్నారని ఆయన అన్నారు.