జపాన్ పర్యటనకు బయల్దేరిన ప్రధాని మోదీ
రెండురోజుల పాటు జపాన్లో పర్యటించనున్న మోదీ..
15వ భారత్-జపాన్ వార్షిక శిఖరాగ్ర సదస్సుకు మోదీ..
మోదీ ఆ దేశానికి వెళ్లడం ఇది ఎనిమిదోసారి కావడం చెప్పుకోదగ్గ అంశం. శుక్రవారం షిగేరు ఇషిబా, మోదీలు కలిసి భారత్-జపాన్ 15వ శిఖరాగ్ర సదస్సును నిర్వహించనున్నారు. ‘‘15వ శిఖరాగ్ర సమావేశం ప్రధానమంత్రులు ఇద్దరూ ద్వైపాక్షిక సంబంధాలను లోతుగా సమీక్షించడానికి గత కొన్నేళ్లుగా వివిధ రంగాలలో సాధించిన పురోగతిని అంచనా వేయడానికి, ఎప్పటిలాగే, ప్రాంతీయ, ప్రపంచ ప్రాముఖ్యత గల అంశాలపై అభిప్రాయాలను పంచుకోడానికి అవకాశాన్ని కల్పిస్తుంది’’ అని విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ మీడియాకు వెల్లడించారు. అమెరికా టారిఫ్ల వేళ.. మోదీ జపాన్ టూర్కి ప్రాధాన్యత ఏర్పడింది..ఇది ఇరు దేశాల సంబంధాల్లో మరింత స్థిరత్వం పెంచడానికి, కొత్త అవకాశాలు, సవాళ్లకు ప్రతిస్పందించడానికి అనేక కొత్త కార్యాచరణలు ప్రారంభించడానికి కూడా ఒక అవకాశం అవుతుంది’’ అని తెలిపారు. విదేశాంగ శాఖ ప్రకటన ప్రకారం.. భారత్, జపాన్ల మధ్య ఉణ్న రక్షణ, భద్రత, వాణిజ్యం, ఆర్ధిక, టెక్నాలజీ, ఆవిష్కరణలు, ప్రజల మధ్య సంబంధాలు సహా ప్రత్యేక వ్యూహాత్మ, అంతర్జాతీయ భాగస్వామ్యాన్ని ఇరువురు ప్రధానులు సమీక్షించనున్నారు. అలాగే, ప్రాంతీయ, అంతర్జాతీయ ప్రాముఖ్యత అంశాలపై కూడా చర్చిస్తారని పేర్కొంది.