అరె ఏంట్రా ఇది… మోదీ మాస్క్‌తో దొంగతనం..!

|వైరల్ వార్త :-

మోదీ మాస్క్‌తో దొంగతనం..!

రాజస్థాన్‌లోని భిల్‌వారాలో ఓ విచిత్రమైన దొంగతనం వెలుగులోకి వచ్చింది.ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాస్క్ ధరించి ఓ వ్యక్తి మొబైల్ షాపులోకి చొరబడ్డాడు.షాపు తాళాలు పగలగొట్టి సుమారు 40 ఖరీదైన మొబైల్ ఫోన్లను దొంగిలించి పరారయ్యాడు…

ఈ ఘటన సీసీటీవీ కెమెరాల్లో నమోదైంది.నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు…

దొంగలు చోరీ చేయడానికి రకరకాల వేషాలు వేయడం మనం చూస్తుంటాం. కానీ రాజస్థాన్‌లో ఓ దొంగ ఏకంగా దేశ ప్రధాని నరేంద్ర మోదీ మాస్క్ ధరించి మొబైల్ షోరూమ్‌లో భారీ చోరీకి పాల్పడటం తీవ్ర కలకలం రేపుతోంది.

రాజస్థాన్‌లోని భిల్వారా జిల్లా కరేడా పట్టణంలో ఈ వింత చోరీ జరిగింది. సోమవారం అర్ధరాత్రి సమయంలో మాతేశ్వరి మొబైల్ షాపులోకి దొంగలు పైకప్పు మీదుగా లోపలికి ప్రవేశించారు. తమ ముఖాలు సీసీటీవీ కెమెరాలకు చిక్కకుండా ఉండేందుకు, అందులో ఒక దొంగ ప్రధాని నరేంద్ర మోదీ ముఖం ఉన్న మాస్క్‌ను ధరించాడు..

లోపలికి చొరబడిన ఈ దొంగలు సుమారు రూ. 4 నుంచి 5 లక్షల విలువైన 35-40 ఖరీదైన స్మార్ట్‌ఫోన్లను ఎత్తుకెళ్లారు. ఉదయం షాపు యజమాని వచ్చి చూడగా ఫోన్ల బాక్సులు ఖాళీగా పడి ఉండటంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

అంతేకాకుండా, అదే రాత్రి పట్టణంలో ఉన్న మరో మొబైల్ షాపు వద్ద కూడా మోదీ మాస్క్ ధరించిన ఇదే దొంగ షట్టర్ తాళాలు పగలగొట్టేందుకు విఫలయత్నం చేశాడు. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ విజువల్స్ నెట్టింట విపరీతంగా వైరల్ అవుతున్నాయి. విజువల్స్ ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దొంగల కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు.

⚠️ గమనిక: మాస్క్ ధరించడం నిందితుడి వ్యక్తిగత చర్య మాత్రమే. దీనికి ప్రధానమంత్రి లేదా ఏ రాజకీయ పార్టీకి ఎలాంటి సంబంధం లేదు…!