సోమవారం సుప్రీంకోర్టుకు తెలంగాణ ప్రభుత్వం.

సోమవారం సుప్రీంకోర్టుకు తెలంగాణ ప్రభుత్వం.

* బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టుకు వెళ్లాలని నిర్ణయం..

* హైకోర్టు తీర్పును స్టడీ చేసిన ప్రభుత్వం..

* సీనియర్‌ కౌన్సిల్‌తో సుప్రీంకోర్టులో వాదనలు వినిపించాలని సీఎం రేవంత్‌ రెడ్డి నిర్ణయం..

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ల జీవోను, ఎన్నికల నోటిఫికేషన్ అమలును నిలిపివేస్తూ హైకోర్టు స్టే ఇచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేయాలని, హైకోర్టు ఇచ్చిన స్టేను ఎత్తివేసి ఎన్నికల నిర్వహణకు అనుమతి కోరాలని, ఈ మేరకు సీనియర్ కౌన్సిల్తో వాదనలు వినిపించాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించినట్లు తెలుస్తోంది. దీంతో సోమవారం పిటిషన్ దాఖలు చేసే అవకాశం కనిపిస్తోంది.

ఎన్నికల ప్రక్రియ, నామినేషన్ల స్వీకరణ కూడా ప్రారంభమైనందున ఇందులో హైకోర్టు జోక్యం సరికాదని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో ప్రధానంగా వాదించే అవకాశాలు కనిపిస్తున్నాయి. సుప్రీంకోర్టు తీర్పులకు అనుగుణంగా జనాభా గణాంకాలపై సర్వే నిర్వహించి, బీసీ జనాభా 57.6% ఉన్నందున 42% రిజర్వేషన్లు కల్పించామని, దీనికి అనుగుణంగా రిజర్వేషన్ల పరిమితిని సవరిస్తూ చట్టం తీసుకువచ్చిన విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లనుంది. ఇదిలా ఉంటే..

రిజర్వేషన్ల జీవో 9ను సవాలు చేస్తూ పిటిషన్ దాఖలు చేసిన బీ మాధవరెడ్డి, మరొకరు.. సుప్రీంకోర్టులో కేవియట్ దాఖలు చేశారు. రిజర్వేషన్లకు సంబంధించి హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ఎవరైనా అప్పీలు దాఖలు చేస్తే తమ వాదన వినకుండా ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వరాదని అభ్యర్థించారు..