న్యాయవాది మొయినుద్దీన్ మృతి..!

హైదరాబాద్‌లో మాసబ్ ట్యాంక్ వద్ద కారు దాడిలో తీవ్రంగా గాయపడిన లాయర్ ఖాజా మొయినుద్దీన్ మరణించారు. ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన ప్రాణాలు విడిచారు. ఆయన ఇంటి నుంచి బయటకు రాగానే గుర్తుతెలియని దుండగులు ఉద్దేశపూర్వకంగానే కారుతో బలంగా ఢీకొట్టి అక్కడినుంచి పరారయ్యారు. పోలీసులు హిట్‌ అండ్‌ రన్‌ కేసును హత్య కేసుగా మార్చి ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. భూవివాదాల వల్లే పక్కా ప్లాన్‌తో దుండగులు ఈ హత్య చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు.కాగా తీవ్ర‌గాయాల‌పాలైన మొయినుద్దీన్ చికిత్స పొందుతూ మ‌ర‌ణించారు. ఈ ఘ‌ట‌న‌పై హిట్ అండ్ ర‌న్ కేసు న‌మోదు చేయ‌గా త‌ర‌వాత హ‌త్య కేసుగా మార్చారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నాంపల్లి పోలీసులు కారు నంబర్ ట్రేస్ చేస్తున్నారు. భూ వివాదాల కార‌ణంగానే నిందితులు మొయినుద్దీన్ ను హ‌త్య చేసిన‌ట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. మరోవైపు మొయినుద్దీన్ వ‌క్ఫ్ బోర్డు భూముల ర‌క్ష‌ణ కోసం సైతం పోరాడుతున్నట్టు తెలుస్తోంది. ప్ర‌స్తుతం న్యాయ‌వాదిపై జ‌రిగిన దాడికి సంబంధించిన వీడియో నెట్టింట వైర‌ల్ అవుతోంది. పక్కా ప్లాన్ ప్రకారమే నిందితులు కాపు కాచి న్యాయవాదిని కారుతో ఢీ కొట్టినట్టు సీసీ టీవీ ఫుటేజ్ చూస్తే అర్థం అవుతోంది. దీంతో న్యాయవాదులు తమ రక్షణపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తరచూ న్యాయవాదులపై ఇలాంటి దాడులు పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు