జగిత్యాల జిల్లా పెగడపల్లి.
తహసీల్దార్ రవీందర్ నాయకు ను లైంగిక వేధింపుల కేసులో శుక్రవారం జగిత్యాల పట్టణ పోలీసులు అరెస్టు చేశారు. ఇటీవల జగిత్యాలలో నిర్వహించిన ఇందిరమ్మ ఇళ్ల దర ఖాస్తుదారుల సర్వే విధుల్లో ఉన్న తనను బలవంతంగా కారులో ఎక్కించుకొని కోరిక తీర్చమని తహసీల్దార్ వేధిం చాడని ఓ వార్డు మహిళా అధికారిణి పోలీసులకు ఫిర్యాదు చేశారు. శుక్రవారం తహసీల్దార్ రవీందర్ నాయక్ ను అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపినట్లు సీఐ పి.కరుణాకర్ తెలిపారు. కాగా ఈ కేసులో రాజీ పడాలంటూ బాధితురాలిపై జిల్లాకు చెందిన మరో తహసీల్దార్ పోలీస్ స్టేషన్లోనే ఒత్తిడి తెచ్చినట్లు ప్రచారం జరుగుతోంది.