సూర్యాపేట జిల్లా.
గరిడేపల్లి మండలంలో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎమ్మార్పీఎస్ – ఎంఎస్పి) ఉద్యమాన్ని వర్గాలుగా చీల్చే ప్రయత్నాలను ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదని ఎమ్మార్పీఎస్ నాయకులు గరిడేపల్లి మండల కమిటీ అధ్యక్షులు కొత్తపల్లి రవి మాదిగ..స్పష్టం చేశారు. ఎమ్మార్పీఎస్ అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలకు వారు హృదయపూర్వక ఉద్యమాభివందనాలు తెలిపారు..
ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు, పద్మశ్రీ అవార్డు గ్రహీత గౌరవ మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో 1994 జూలై 7న ప్రకాశం జిల్లా వీదీముడి గ్రామంలో దండోరా ఉద్యమంగా ఆవిర్భవించిన ఎమ్మార్పీఎస్, ఎస్సీ వర్గీకరణ లక్ష్యంగా 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం చేసి వర్గీకరణ సాధించిందని వారు గుర్తు చేశారు.
సామాజిక న్యాయం, అణగారిన వర్గాల హక్కుల సాధన కోసం అనేక మంది నాయకులు జాతి లక్ష్యంగా పనిచేశారని తెలిపారు. మందకృష్ణ మాదిగ గారి పిలుపుమేరకు యువత నూతన నాయకత్వంలో భాగస్వాములై, వర్గాలకు తావు లేకుండా రాజ్యాధికారమే లక్ష్యంగా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించామని చెప్పారు. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా జిల్లా ఇన్చార్జీలను నియమించి, వారి ఆధ్వర్యంలో మండల, గ్రామ స్థాయి నూతన కమిటీలను ఏర్పాటు చేసినట్లు వివరించారు.
అయితే, కొంతమంది కావాలనే ఉద్యమాన్ని నీరుగార్చే ప్రయత్నంలో భాగంగా, ఉద్యమానికి ఎలాంటి సంబంధం లేని వ్యక్తులు గరిడేపల్లి మండలంలో చురుకుగా వ్యవహరిస్తూ, ఎలాంటి సేవ చేయని వారిని ముందుకు తెచ్చే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. సుమారు ఏడాది కాలంగా గౌరవ మందకృష్ణ మాదిగ గారి ఆధ్వర్యంలో నూతన మండల, గ్రామ కమిటీలు ఏర్పాటు అవుతున్నాయని స్పష్టం చేశారు.
గరిడేపల్లి మండల కమిటీకి గానీ, మండల అధ్యక్షులు , జిల్లా నాయకుల ఆదేశాలు లేకుండానే, ఎమ్మార్పీఎస్ కార్యచరణకు విరుద్ధంగా కొంతమంది వ్యక్తులు తమ స్వలాభం కోసం వర్గాలుగా పనిచేస్తున్నారని తెలిపారు. అలాంటి వ్యక్తులకు ఉద్యమంతో ఎలాంటి సంబంధం లేదని, వారు చెప్పే మోసపూరిత మాటలను మాదిగ జాతి ప్రజలు నమ్మవద్దని ఎమ్మార్పీఎస్ నాయకులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
గమనిక.. మీ ప్రాంతాల్లో A TO Z వార్తలు ఏదైనా..మాకు సమాచారం అందించండి.
వాట్సాప్..+91 91330 57959